సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంపై పోలీస్ శాఖ కీలక నిర్ణయం..!

సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంపై పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం భద్రత విషయంలో స్వల్ప మార్పులు చేసింది. సీఎం నివాసం వద్ద భద్రత విధుల్లో ఉన్న తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం(టీజీఎస్పీ) సిబ్బందిని తొలిగించింది..వారి స్థానంలో సిటీ ఆర్మ్డ్ రిజర్వు(కార్) సిబ్బందిని నియమించింది. మొత్తం సీఎం నివాసం వద్ద విధులు నిర్వర్తిస్తున్న 22 మంది టీజీఎస్పీ సిబ్బందిని తొలిగిస్తు నిర్ణయం తీసుకుంది.
కాగా గత కొన్ని రోజులుగా టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న టీజీఎస్పీ సిబ్బంది కూడా ఆందోళన చేసే అవకాశం ఉందనే సందేహంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆందోళన చేస్తున్న కొంత మంది సిబ్బందిని లో రాష్ట్ర పోలీసు శాఖ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే