జగిత్యాల గంగారెడ్డి ఇంట్లో మంత్రి శ్రీధర్ బాబుకి ఘోర అవమానం జరిగింది. గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబుకి ఘోర అవమానం జరిగింది..మంత్రి శ్రీధర్ బాబు ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు మారు గంగారెడ్డి సోదరి రాధ. అసలు రేవంత్ రెడ్డి అనేటోడు మేము చేయబట్టే సీఎం అయ్యాడు అని ఫైర్ అయ్యారు.!
Maru Ganga Reddy’s sister Radha expressed her anger in front of Minister Sridhar Babu
గత గవర్నమెంట్లో మంచిగా ఉన్నామని ఆమె తెలిపారు. మన గవర్నమెంట్ వచ్చాక భయపడి బ్రతుకుతున్నాం అంటూ హత్యకు గురైన కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి సోదరి రాధ ఆగ్రహించారు. కాగా జగిత్యాల జిల్లాలో హత్యకు గురైన
గంగారెడ్డి సోదరి రాధ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంత్రి శ్రీధర్ బాబు ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా తమ్ముడి హత్యతో మేం మానసికంగా చనిపోతున్నాం. ఆ పిల్లలు ఇప్పుడు ఎవరిపై ఆధారపడాలి. దారి వెంట పోతున్న మా తమ్ముడిపై అన్ని పోట్లు పొడిచి చంపిండంటే.. మేం ఉన్న చనిపోయినట్టే. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు..? వాళ్ల కళ్లు మూసుకుపోయాయా..? పోలీసోళ్లు ఇప్పుడొచ్చి ఇక్కడ లైన్ కడితే మా తమ్ముడు తిరిగి వస్తడా..? మేం చేయబట్టి రేవంత్ అనేటోడు సీఎం అయిండు అని రాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎంను అంతమాట అనొద్దమ్మా అని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతుండగా.. మళ్లీ ఆమె ఫైర్ అయ్యారు. ఏం మాట అనొద్దు.. అనొద్దు అనొద్దు అనుకుంట మా నోరు బంద్ చేపిస్తున్నరు. మాకు ఎంత బాధ అనిపిస్తది. జీవన్ అన్న వెంట 40 ఏండ్ల నుంచి ఉంటున్నాం అని రాధ ఆవేదన వ్యక్తం చేశారు.
గత గవర్నమెంట్లో మంచిగా ఉన్నాం.. మన గవర్నమెంట్ వచ్చాక భయపడి బతుకుతున్నాం అంటూ అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. మంత్రి తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ థాకూర్ ఉన్నారు..