తెలంగాణ లొ పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు..బీజేపీ- బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదర్చుకున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుందన్నారు. ఎందుకు నెరవేర్చలేకపోతున్నారో ఆలోచించుకోవాలన్నారు. హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు..ప్రత్యేక పోలీసు కానిస్టేబుళ్లకు మట్టి పనులు చెప్పడం, అనధికారికంగా ఆర్డర్లీ సేవలకు వినియోగించడం వంటి విధానాలకు స్వస్తి పలకాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీజీఎస్పీ పోలీసులు చేస్తున్న ఆందోళనలను మానవతా ధృక్పథంతో అర్థం చేసుకొని డిస్మిస్ చేసిన 10 మందిని, సస్పెండ్ చేసిన 37 మందిని విధుల్లోకి తీసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. సివిల్ పోలీసుల మాదిరిగానే ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం అమలు చేయాలన్న ప్రత్యేక పోలీసు సిబ్బంది డిమాండ్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను పట్టించుకోకపోవడంతోనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.