ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేక రిపోర్టర్ పై హత్యాయత్నం..సీఐ చరమంద రాజు..!

*ఆధిపత్య పోరుతోనే రిపోర్టర్ హత్యాయత్నం.. సీఐ చరమంద రాజు* ..

*సూర్యాపేట జిల్లా….

హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఐ చరమందరాజు ప్రెస్ మీట్…

జర్నలిస్టు సందీప్ పై హత్యాయత్నం చేసిన, ఆరుగురు వ్యక్తుల్ని అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించిన పోలీసులు.

*ఈ సందర్భంగా సీఐ చరమంద రాజు మాట్లాడుతూ..*

జర్నలిస్ట్ సందీప్ పై జరిగిన దాడి పూర్తిగా వ్యక్తిగతం,సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు ఇది మతపరమైన గొడవకాదు. సందీప్ అయ్యప్ప మాలలో అని ఉండడం వలన,అందరు అలా భావిస్తున్నారు.
హైదారాబాద్ కొరియర్ జాబ్ చేసే సందీప్2సంవత్సరాల క్రితం జాన్పహాడ్ దర్గా వద్దకు వచ్చి అక్కడ రెండు కిరాణా షాపులు నడుపుతున్నాడు. సందీప్ తండ్రి అంకారావు, జహంగీర్ తండ్రి షంశుద్దీన్ మంచి స్నేహితులు,
మొదటి నుండి ఇరువురి కుటుంబాలు స్నేహంగా ఉండేవి, జహంగీర్ స్వతహాగా కారు డ్రైవర్, సూర్యాపేట ఎక్కువ ఉంటాాడు, సందీప్ 6టీవీ రిపోర్టర్ గా పనిచేస్తూ, గ్రామంలో ప్రజలుకు మంచి చెడులో అందుబాటులో ఉంటున్నాడు. సందీప్ పేరు రావడం జహంగీర్ కు నచ్చలేదు. అప్పటి నుంచి మనసులో పెట్టుకొన్నాడు.
గణేష్ ఉత్సవాలు ప్లెక్సీ విషయంలో, చిన్న గలాటా జరిగింది. నిమజ్జనం రోజు వారీ ప్రక్క గ్రామం కోమటికుంట వారితో గొడవ జరిగింది. అప్పుడు సందీప్ కొమటికుంట గ్రామం వారివైపు మాట్లాడడం జరిగింది.అలా మాట్లాడడం జహంగీర్ కు నచ్చలేదు. ఎక్కడి నుండో వచ్చిన వాడికి పేరు వస్తుంది. ఆధిపత్యం చాలా ఇస్తున్నాడు,ఎలాగైనా సందీప్ ఆధిపత్యానికి తెరదించాలని భావించాడు. ఈనెల 26వ తారీఖున దేవుడమ్మ అలియాస్ విజయ రెడ్డి అనే ఆమె కందురు చేస్తూ,జహంగీర్ ని రమ్మని పిలిచింది.

ఆరోజు జహంగీర్ తన ఫ్రెండ్ ఫణిందర్ ను వెంటబెట్టుకొని అక్కడికి రావడం జరిగింది.

వచ్చాక దర్గాలో దేవుని దర్శించుకుని ఫ్రెండ్స్ అందరు కలిసి మందు తాగుతూ, సందీప్ అనే వ్యక్తి ఊళ్లో చాలా రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడని.. ,
అనే విషయం గురించి చర్చించడం జరిగింది…

గతంలో కూడా జరిగిన గొడవలను ప్రస్తావించటం జరిగింది..

గతంలో గణేష్ విగ్రహాన్ని సందీప్ ఇవ్వడం,, గ్రామస్తులతో దగ్గర అవుతున్నాడని,, తమ ప్రాబల్యం తగ్గిపోతుందని కక్ష పెంచుకోవడం,,
గణేష్ నిమజ్జనం రోజు, రెండు గ్రామాల మధ్య గొడవ జరిగితే ఒక గ్రామానికి చెందిన వ్యక్తులకి సందీప్ మద్దతు తెలపటం,,.. మరో వర్గానికి నజీర్ మద్దతు తెలపటం.. మరికొంత గొడవకు దారితీసింది..

అంతేకాకుండా సందీప్ రిపోర్టర్ కావడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయ అధికారులతో, సన్నిహితంగా ఉండి తన వద్దకు వచ్చిన వారికి పనులు చేసి పెడుతుంటే తమకంటే ఎక్కువ ఎదుగుతున్నాడు కక్ష సాధింపు పెంచుకోవడం హత్యాయత్నానికి దారితీసింది అన్నారు..
దీంతో
సందీప్ కి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఆలోచనతో ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకొని చర్చించి నజీర్ చికెన్ సెంటర్లో పనిచేస్తున్న సైదులు దగ్గరికి పోయి, మాకు కత్తి కావాలనీ అడిగారు, సందీప్ అనే వ్యక్తి ఇలా చేస్తున్నాడు, అని చెప్పగా, సైదులు అనే వ్యక్తి కూడా నేను కూడా వస్తా అని అందరూ కలిసి సందీప్ ఇంటికి వెళ్లడం జరిగింది. సందీప్ ని ముందుగా పలకరించగా,సందీప్ కూడా వారిని ఇంట్లోకి తీసుకెళ్లడం జరిగింది గ్రామ విషయాలు చర్చకు రావడంతో మాటమాట, పెరగడంతో ముందుగా అనుకున్న పథకం ప్రకారం కత్తితో సందీప్ పై దాడి చేయడం జరిగింది. వెంటనే సందీప్ గట్టిగా అరవడంతో అక్కడివాళ్ళు వచ్చేసెటర్ లేపగానే, సందీప్ అక్కడ బయటకు రావడం జరిగింది. జహంగీర్ తన స్నేహితులు నుంచి పారిపోవటం జరిగింది.
వారి బండి ఎర్టిగా కారును పెట్రోల్ బంకు సందులో దాచిపెట్టి వెళ్లడం జరిగింది. ఈరోజు ఆ కారు కోసం వాళ్లు దర్గా దగ్గరికి రావడంతో, నమ్మదగిన సమాచారంతో మేము వారు ఒక ఇంట్లో ఉండగా అక్కడికి వెళ్లి వారిని పట్టుకోనీ రిమాండ్ కు తరలించడం జరిగింది..

ఇది కక్షపూరిత గొడవలు తప్ప, రెండు మతాల మధ్య గొడవ కాదు…. దీనికి ఎటువంటి మత విద్వేషలతో జరిగింది కాదని అన్నారు.. కొందరు సోషల్ మీడియాలో ఈ ఘటనను మరో విధంగా ప్రచారం చేయడం జరిగిందని అన్నారు.. అదంతా అవాస్తవం అని తెలిపారు…

ఈ కార్యక్రమంలో పాలకీడు ఎస్సై తో పాటు ,, హుజూర్ నగర్ asi బలరాం రెడ్డి,,పలువురు సిబ్బంది పాల్గొన్నారు..