తెలుగు రాష్ట్రాల మధ్య మరో జాతీయరహదారి అందుబాటు లోకి..!

*సూర్యాపేట – రాజమండ్రి వరకు నేషనల్ హైవే*

తెలుగు రాష్ట్రాల మధ్య మరో జాతీయరహదారి అందుబాటు లోకి రానుంది.

సూర్యాపేట నుంచి కూసుమంచి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావు పేట, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదుగా పోలవరం వద్ద పట్టిసీమను కలిపేలా రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిని నాలుగు రహదారులుగా త్వరలో విస్తరించనున్నారు.

86.5 కి.మి మేర విస్తరణ జరగనుండగా 40.42 KM మేర తొలి ప్యాకేజీని రూ.367.97 కోట్లతో నిర్మించనున్నారు. జనవరి నెలాఖరు లో పనులుప్రారంభం కానున్నాయి.