ఇంట్లో ఆలుగడ్డలు పోయాయి అంటూ పోలీసులకు ఫిర్యాదు..!

ఇంట్లో ఆలుగడ్డలు పోయాయి అంటూ పోలీసులకు ఫిర్యాదు.. యూపీ – మా ఇంట్లో దొంగలు పడ్డారు అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు.. వెంటనే పోలీసులు ఆ ఇంటికి వచ్చారు. తీరా చూస్తే పావుకిలో ఆలుగడ్డలు పోయాయంటూ తప్పతాగిన ఓ వ్యక్తి తాపీగా చెప్పాడు. పైగా అవి వంట కోసం తోలు వలిచి పెట్టుకున్నవి, వెంటనే పట్టుకురండి అనడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. దింతో మళ్లీ ఇలా చేయొద్దని మందలించారు.