లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్

నల్లగొండ జిల్లాలలో ముందస్తు అరెస్టులు.

చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అరెస్టు చేసిన పోలీసులు

వలిగొండ మండలం సంగెం వద్ద మూసీ పరివాహక ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో అరెస్ట్

గతంలో సీఎం ప్రోగ్రాం ను అడ్డుకుంటామని హెచ్చరించిన చిరుమర్తి లింగయ్య

అరెస్ట్ చేయడంపై పోలీసులతో చిరుమర్తి లింగయ్య వాగ్వివాదం

ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు..

టీడీపీ అఫిషియల్‌ ట్విట్టర్‌లో అసత్యం పోస్టులు మరి అరెస్టు లేదు.. మాజి సిఎం జగన్.

మా అమ్మ విజయమ్మ కారు టైరు బరెస్ట్ అయితే జగన్‌ వాళ్ల అమ్మను చంపడానికి చూసాడని తెలుగుదేశం పార్టీ అఫిషియల్‌ లో రాసారు.. దానిపై అమ్మ ప్రకటన ఇస్తే ఆ లేఖ కూడా ఫేక్‌ అని టీడీపీ అఫిషియల్‌ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు..చివరకి మా అమ్మ వీడియో విడుదల చేసి చెప్పాల్సి వచ్చింది. ఈ ఫేక్‌ పోస్టులు పెట్టిన నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ , ABN రాధాకృష్ణలను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు?..మాజి సిఎం వైయస్‌ జగన్.

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, SIB మాజీ OSD ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు లభించినట్లు సమాచారం. ఇక ఆయన ఇప్పట్లో హైదరాబాద్ రారని, ఈ కేసు విచారణకు బ్రేక్ పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలా ముందుకెళ్లాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా గ్రీన్ కార్డు ఉన్నవాళ్లు అమెరికాలో ఎన్ని రోజులైనా ఉండొచ్చు….

కులం, మతం గుర్తుకు రాలేదా..పీసీపీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్..

కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవి అనుభవించినప్పుడు మహేశ్వర్ రెడ్డికి రాహుల్ గాంధీ కులం, మతం గుర్తుకు రాలేదా అని పీసీపీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. రాహుల్గాంధీపై బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఫైన్అయ్యాడు..ఇవాళ గాంధీభ వన్లో ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.. బీజేఎల్పీ పదవి ఎప్పుడూ ఉడుతదో తెలియక మహేశ్వర్రెడ్డి తికమకగా మాట్లాడుతున్నా రని అన్నారు. ‘ 2015లో రాహుల్ గాంధీని పిలిచి నిర్మల్ లో పాదయాత్ర చేసినప్పుడు మహేశ్వర్ రెడ్డి కి రాహుల్ గాంధీ ఏ కులమో తెలియదా..? ఇప్పుడు రాహుల్ గాంధీ ది ఏ కులం అడుగుతుండు.
జాతి మొత్తం అభిమా నించే నాయకుడు రాహుల్ గాంధీ. భారతదేశ కులం రాహుల్ గాంధీ కులం ఒక్కటే. బీసీ అయిన బండి సంజయ్ ని స్టేట్ ప్రెసిడెంట్ గా తొలగించి ఓసీకి అప్పగించారు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శులు చేయడం హా స్యాస్పదం.
బీసీలకు మీ పార్టీ చేసిందీ ఏమీ లేదు. మహేశ్వర్ రెడ్డి కులగణన గురించి మా ట్లాడుతున్నాడు. దమ్ముంటే ప్రధాని మోడీని 2025 లో జరిగే జనగణనలో ఓబీసీల అంశం కూడా చేర్చాలని చెప్పండి. అప్పుడు తెలుస్తది రాహుల్ గాంధీ ఏ కులం అనేది. దేశంలో, రా ష్టంలో బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే తపన కాంగ్రెస్ పార్టీకి ఉంది.’ అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు…

పొలం దున్నుతుండగా బయటపడిన పురాతన ఆయుధాలు

యూపీ ,, షాజహాన్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు తమ పొలాలను దున్నుతుండగా పురాతన ఆయుధాలు బయటపడ్డాయి. సమాచారం ప్రకారం ఈ ఆయుధాలన్నీ 18వ శతాబ్ధానికి చెందినవిగా చెబుతున్నారు..సుమారుగా ఇవి 200 ఏళ్ల నాటివని సమాచారం. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం..రైతులు పొలం దున్నుతుండగా నాగలికి ఐరన్‌ వస్తువు తగిలిన శబ్దం వినిపించిందని, వెంటనే అక్కడ తవ్వకాలు జరిపినట్టుగా చెప్పారు. కొంత లోతు వరకు తవ్వగా కత్తులు, బాకులు, ఈటెలు, తుపాకులు లభించాయని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు వెంటనే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. పురావస్తు శాఖకు కూడా సమాచారం అందించారు. దీంతో పాటు తిల్హార్ ఎమ్మెల్యే సలోనా కుష్వాహా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

షాజహాన్‌పూర్‌లోని ధాకియా తివారీ గ్రామానికి చెందిన బాబు రామ్ మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం పొలంలో ఉన్న మట్టిని జేసీబీ నుంచి తొలగించినట్లు తెలిపారు. అదే పొలంలో మట్టిని తవ్వేసిన తరువాత ఇప్పుడు మొదటిసారిగా పొలాలను దున్నుతున్నట్టుగా చెప్పారు. ఈ క్రమంలోనే పురాతన ఆయుధాలు లభించాయని చెప్పారు.

ఈ విషయానికి సంబంధించి, చరిత్రకారుడు వికాస్ ఖురానా మాట్లాడుతూ, ఈ ఆయుధాలు 18వ శతాబ్దానికి చెందినవి కావచ్చు అన్నారు. ఎందుకంటే భారతదేశంలో తుపాకుల వాడకం 18వ శతాబ్దంలో ప్రారంభమైందని చెప్పారు. బాబర్ కాలంలో భారతదేశానికి తుపాకులు తీసుకువచ్చారు. ప్రస్తుతం, వాటిపై పూర్తి అధ్యయనం జరుగుతుందని చెప్పారు. ఇంతకు ముందు కూడా ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో జరిపిన తవ్వకాల్లో ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర ఆనవాళ్లు బయటపడ్డాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అవన్నీ మొఘల్ యుగానికి చెందినవిగా గుర్తించారు..

సర్వేకి హిందువులనే పంపాలి.ఎమ్మెల్యే రాజాసింగ్.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వే(Census Survey)లో భాగంగా హిందూ కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో హిందువులనే సర్వేకి పంపాలని గోషామహల్ ఎమ్మెల్యే(Goshamahal MLA) రాజాసింగ్(Raja Singh) గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు..తమ వద్ద పలు ఏరియాల్లో ముస్లింలను పంపి బెదిరించి సర్వే చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి అవసరం లేని అంశాలను తీసుకుంటోందని, మూసీ సుందరీకరణ అంశం కూడా అలాంటిదేనని ఫైరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో జీరో అని ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్పొరేషన్.. ఒక చెత్త కార్పొరేషన్ లాగా తయారైందని, నిధులు లేక మున్సిపాలిటీల్లో ఏ పని కావడం లేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే లక్ష్యం ఎంటో ఇప్పటి వరకు తెలియట్లేదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందో ఎవరికి తెలియదని, కాంగ్రెస్ కూడా సర్వే వివరాలు ఢిల్లీకి పంపుతారా లేక ప్రజల్లో పెడతారా చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు..

రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు.

Ts రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ బదిలీల కోసం తనను కలుస్తున్నారన్నారు. అలాంటి వారు బదిలీల కోసం తన వద్దకు రావొద్దని తేల్చి చెప్పారు..పైనుంచి తనపై చాలా ఒత్తిడి ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

లైసెన్స్ కలిగివున్న డ్రైవర్లకు భారీ ఊరట..!

ఎల్ఎంవీ లైసెన్స్ కలిగివున్న డ్రైవర్లకు భారీ ఊరట లభించింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు కూడా ఇకపై కమర్షియల్ వెహికల్ నడపడానికి అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది..ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా 75 క్వింటాళ్ల బరువుకు మించని రవాణా వాహనాలను నడుపుకోవచ్చని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని 5గురు సభ్యుల ధర్మాసనం.. చిన్న వ్యాపారులు, ఆటోలు, క్యాబ్లు నడిపేవారు ఎల్ఎంవీ లైసెన్స్తో 7,500 కిలోల బరువున్న వాణిజ్య వాహనాలను నడిపేందుకు అర్హులేనని తెలిపింది. ఇదే సమయంలో అపాయకరమైన సరకులను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఇది వర్తించదని సూచించింది..

కమల్‌హాసన్‌ ఇంటి దగ్గర ముస్లిం సంఘాలు ఆందోళన..!

కమల్‌హాసన్‌ ఇంటి దగ్గర ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇటీవల కమల్ నిర్మించిన అమరన్‌ మూవీలో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపెట్టారని ఆరోపిస్తూ చెన్నైలోని కమల్ ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. అమరన్‌ లో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కమల్‌హాసన్‌ దిష్టిబొమ్మ దహనం చేయడంతోపాటు.. తక్షణమే సన్నివేశాలను తీసేయాలని నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. శివకార్తికేయ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన అమరన్‌ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఓ జవాన్ నిజ జీవితం ఆధారంగా వచ్చిన ఈ అమరన్‌ ను కమల్‌ హాసన్‌ ప్రొడ్యూస్ చేశారు. అయితే అందులో ముకుంద్ వరదరాజన్ కులాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఇటీవల వివాదాలు తలెత్తాయి.

ఈ వివాదం ఇప్పుడు సద్దుమణగగా, అన్నాడీఎంకే కూటమిలో భాగమైన SDPI అమరన్ ను బ్యాన్ చేయాలని ఆందోళనకు దిగింది. దీంతో పై మళ్లీ వివాదం చెలరేగింది. వాస్తవానికి ల్లో ప్రయోగాలకు ఎప్పుడూ తహతహలాడుతుంటాడు కమల్‌ హాసన్‌. మాస్, క్లాస్ ప్రేక్షకుల కోసం చాలా అరుదైన అంశాలను తన కు ముడిసరుగ్గా ఎంచుకుంటాడు. ప్రయోగాల కోసం కమల్‌ నిర్మాతగా కూడా మారాడు. అయితే కమల్ హాసన్‌ నటించిన, ప్రొడ్యూస్‌ చేసిన లపై గతంలోనూ వివాదాలు రాజుకుంటున్నాయి.

విశ్వరూపం పై కూడా కొన్ని వర్గాలను నుంచి అభ్యతరం వ్యక్తమైంది. భారతీయుడు -2 పేరుపై కూడా రచ్చ జరిగింది. గతంలో కమల్ హాసన్ దశావతారాలు వివాదాలకు అప్పట్లో నిలయంగా మారింది. ఇలా కమల్‌ హాసన్‌ రిలీజ్‌ అవ్వడం.. దానిపై ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది..

ఆస్ట్రేలియా పర్యటన కోసం మిగతా భారత ఆటగాళ్ల కంటే అక్కడికి ముందే వెళ్లిన స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి నిరాశపరిచాడు.తొలి టెస్టులో రోహిత్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలక్టర్లు అతడిని ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఆడించినా రాహుల్‌ 4 పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇదే ప్రదర్శన పునరావృతమైతే బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి రాహుల్‌ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

జురెల్‌ మెరుపుల్‌.. కేఎల్ రాహుల్‌ విఫలం.!

ఇక మరో ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌, గత ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన సాయి సుదర్శన్‌ డకౌట్‌ అయ్యారు. కెప్టెన్‌ రుతురాజ్‌ (4), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (26), నితీశ్‌ రెడ్డి (16) విఫలమైనా వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ (80) జట్టును ఆదుకున్నాడు. కంగారూల బౌలింగ్‌ దాడిని సమర్థంగా తిప్పికొడుతూ జురెల్‌ సాధికారిక అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. స్టార్‌ బ్యాటర్లంతా విఫలమవడంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌.. 161 పరుగులకు ఆలౌట్‌ అయింది. మిచెల్‌ నెసర్‌(4/27), వెబ్‌స్టర్‌(3/19) రాణించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌.. 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది..