ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కొట్టారని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి..
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన తలారి కిషన్ అనే వ్యక్తి తన ఫోన్ పోయిందని మంగళవారం రాత్రి అల్లాదుర్గం పీఎస్కి వెళ్లాడు.
ఫిర్యాదు తీసుకోవాల్సిన పోలీసులు అతనిపై దురుసుగా ప్రవర్తించగా, కానిస్టేబుల్ సాయిలు అతనిపై చేయి చేసుకున్నాడు.. దీంతో మనస్తాపానికి గురైన కిషన్ సూసైడ్ నోట్ రాసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఫిర్యాదు తీసుకోవాల్సిన పోలీసులు అతనిపై దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సాయిలు…. కిషన్ ను తీవ్రంగా కొట్టాడని కుటంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. అయితే సాయిలు అనే కానిస్టేబుల్ తీరుతో మనస్థాపానికి గురైన కిషన్ సూసైడ్ నోట్ రాసి బుధవారం రాత్రి రాంపూర్ లోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అది గమనించిన గ్రామస్థులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకునేసరికి అతడి శరీరం పూర్తిగా కాలిపోయింది.
కొన ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్న కిషన్ ను వెంటనే చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కిషన్ మృతి చెందాడు. కుటుంబసభ్యులకు అతడి వద్ద సూసైడ్ నోట్ లభ్యమైంది. ఇందులో తనకు న్యాయం జరగలేదు. ధర్మం చచ్చిపోయింది. ఫిర్యాదు చేయడానికి వెళ్తే కానిస్టేబుల్ సాయిలు నన్ను కొట్టాడు అని రాసి ఉంది. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు జాతీయ రహదారి పై..అల్లదుర్గ్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.