అన్నమయ్య జిల్లా: ఓ వ్యక్తి వీపు భాగంలో కత్తి దింపిన మందు బాబు..
బి.కొత్తకోట మండలం గోళ్లతోపులో ఉండే టేకుమంద వీరస్వామి (50)పై అదే ఊరిలో ఉండే భగవాన్(22) మద్యం మత్తులో కత్తితో పొడచి హత్యాయత్నంకు పాల్పడ్డాడు. చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు…
*నటి కస్తూరికి షాకిచ్చిన మధురై హైకోర్టు*
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరి
బెయిల్ పిటిషన్ ను కోట్టివేసిన మధురై హైకోర్టు.
కస్తూరికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు మధురై బ్రాంచ్ జడ్జి ఆనంద్ వెంకటేష్.
మరోవైపు కస్తూరి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు.
ఆమె కోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బృందాలు..
*పంట కొనుగోలు కేంద్రాలపై (ఐకేపీ) ఆసక్తి చూపని రైతులు*
రైతులు రేయింబవళ్లు కష్టపడి పండించిన పంట చేతికి వస్తోందని ఆనందించే లోపు నిధుల కొరత కారణంగా రైతుల వద్ద ప్రభుత్వం ధాన్యం కొంటె డబ్బులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదని ఒకవేళ ధైర్యం చేసి ఎవరైనా ధాన్యం అమ్మడానికి పోతే ఐకేపీ కేంద్రాలలో ధాన్యం కొనడానికి సవా లక్ష నిబంధనలకు తోడు అధికారుల నిర్లక్ష్య ధోరణితో విసిగిపోడం వల్లనే రైతులు ఐకేపీ కేంద్రాలపై ఆసక్తి చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో తప్పనిసరి పరిస్థితి లోనే రైతులు మిల్లర్లకు ధాన్యం అమ్ముతున్నరు
80 % పైగా ధాన్యం రైస్‌మిల్లులకు రవాణా చేస్తుండగా మిగిలిన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి నిల్వ చేసుకుంటున్నరు
తక్షణమే రెండో పంటకు సిద్ధం కావాల్సి రావడం, ప్రభుత్వం వద్ద క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ పథకంపై స్పష్టత లేకపోడం, మొదటి పంటకు రైతు బందు రాకపోవటం, రుణమాఫీ ప్రక్కన పెట్టడం వంటి అంశాల వల్ల ఆయకట్టు రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు
ప్రకటనలకే పరిమిత మైన వాగ్దానాలతో ప్రభుత్వ హామీలపై నమ్మకం కుదరక చిన్న, సన్నకారు రైతులు ఐకేపీ కేంద్రాలపై ఆసక్తి చూపకుండా తాము పండించిన ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకుంటూ నష్టపోతున్నారు…
MP Etala Rajender..
రేవంత్‌కు కండ్లు నెత్తికెక్కాయి..నరేందర్‌రెడ్డి మాటల్లో తప్పేముంది… ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు.!.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లగచర్ల ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి, సర్కారు వైఖరిని తప్పుబట్టారు. భూములు తీసుకోవడానికి వస్తే అధికారులను తన్ని తరమండంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు పిలుపునిచ్చిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే అదే ప్రజల భూములను గుంజుకుంటున్నారని ధ్వజమెత్తారు. లగచర్ల సహా పరిసర గ్రామాల్లో కొందరు దళారులు, మధ్యవర్తులు అసైన్డ్ భూములు పొందిన వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారని, పట్టా భూములు కలిగి ఉన్నవారి నుంచి బలవంతంగా భూములు సేకరించాలని ప్రయత్నించారని ఆరోపించారు. రూ.40 లక్షల విలువైన భూమిని కేవలం రూ.10 లక్షలకే గుంజుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. స్థానికులు తమ గ్రామాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారని తెలిపారు.
నరేందర్‌రెడ్డి మాటల్లో తప్పేముంది?
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్‌రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమున్నదని ఈటల ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కాకపోతే ఎవరు ప్రజలకు అండగా ఉంటారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి వందలసార్లు అలాగే మాట్లాడితే.. ఆయనను ఆనాడు అరెస్తు చేశారా? అని ప్రశ్నించారు. ఇంత బర్నింగ్ ఇష్యూ జరుగుతున్నప్పుడు అసలు అధికారులు గ్రామంలోకి ఎందుకు వెళ్లారని నిలదీశారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల చేత ఛీకొట్టించుకున్నది రేవంత్ సర్కారే అవుతుందని చెప్పారు. హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. 1,500 మంది పోలీసులు 4 గ్రామాలపై పడి రాత్రికి రాత్రే పలువురిని అరెస్ట్ చేసి హింసించారని ఆరోపించారు. ప్రజల భూములు సేకరించాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం చూపించాల్సిందేనని స్పష్టం చేశారు…
రహదారి పక్కన గాలిలో ఎగురుతున్న సమగ్ర కుంటుంబ సర్వే పత్రాలు..!
సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు మేడ్చల్ పట్టణ జాతీయ రహదారి పక్కన పడి ఉండటంతో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు..మున్సిపల్ పరిధిలో అత్వేల్లి సమీపంలోని రేకుల బావి నుంచి ఎల్లంపేట చౌరస్తా వరకు గల 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన గాలిలో ఎగురుతున్న సమగ్ర కుంటుంబ సర్వేఫారాలను గమనించి ఓఆటోడ్రైవర్ గురువారం సాయంత్రం మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తన సిబ్బందితో ఫారాలు పడివున్న ప్రాంతానికి చేరుకుని వాటిని సేకరించి కార్యాలయానికి తీసుకొచ్చారు. కాగా ఫారాల్లో ఎలాంటి వివరాలు లేకుండా ఖాళీగా ఉండటం గమనార్హం. ఫారాలు తరలిస్తున్న క్రమంలో రోడ్డుపై పడిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 500వరకు ఫారాలు స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. సేకరించిన ఫారాలు పూర్తిగా చితికిపోవటంతో నిరుపయోగంగా మారాయని తెలిపారు. ఫారాలు సేకరించిన విషయంపై జిల్లా ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. ఫారాలు రోడ్డుపై పడి ఉండటం పట్ల అధికారులు విచారణ చేపట్టారని కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు…
మంత్రి జూపల్లి టూర్‌లో ఫ్లెక్సీ వివాదం.. ఆర్మూర్‌లో ఉద్రిక్తత.. బిజెపి, కాంగ్రెస్,డిష్యుం డిష్యుం..!
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మధ్య వివాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna rao ) పర్యటిస్తున్నారు. అయితే ఆర్మూర్‌లో మంత్రి జూపల్లి పర్యటన సందర్భంగా కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి (Flexi controvers)కారణమైంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఫొటోలు లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు..
ఏంటీ.. ఇది భారతీయ ఎయిర్‌పోర్టా! జపాన్ యువతికి షాక్!
తాజాగా జపాన్ యువతి బెంగళూరు ఎయిర్‌పోర్టు టర్మినల్ 2ను చూసి ఆశ్చర్యపోయింది. ఏంటీ.. ఇది ఇండియన్ ఎయిర్ పోర్టేనా అని ఆశ్చర్యపోతూ ఆమె పంచుకున్న వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (Viral).
కీకీ చెన్ అనే జపాన్ యువతి టర్మినల్ 2 నిర్మాణ శైలి ఏర్పాట్లకు ముగ్ధురాలైపోయింది. ”ఇండియాలోని అత్యద్భుత ఎయిర్‌పోర్టు టర్మినల్ ఇదే” అంటూ ఆమె వీడియోలో కామెంట్ చేసింది. ఎయిర్‌పోర్టులో లాండవగానే ఆమెను మొదట టర్మినల్ 2 నిర్మాణ శైలి ఆకట్టుకుంది. అక్కడి లాంజ్, వెయిటింగ్ ప్రాంతాలు, ఫుడ్ స్టాల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని కితాబునిచ్చింది. టర్మినల్ లోపలి అలంకరణ కోసం వెదురును వాడటం ఆమెను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా చెకింగ్ కౌంట్లర్లు కూడా ఇలాగే డిజైన్ చేయడం చూసి ఆమె నోరెళ్లబెట్టింది. ”ఇది ఇండియాలోని ఎయిర్‌పోర్టు అంటే నమ్మలేకపోతున్నా” అని వ్యాఖ్యానించింది.
కాగా, ఈ ఎయిర్‌పోర్టులో రెండవ టర్మినల్ డిజైన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అత్యంత అందమైన ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా బెంగళూరు విమానాశ్రయాన్ని యూనెస్కోలోని ప్రీ వర్సాలిస్ అనే ఆర్కిటెక్చురల్ జ్యూరీ గుర్తించింది. అంతేకాకుండా, అత్యత్భుత ఇంటీరియర్స్ డిజైన్‌కు గాను స్పెషల్ ప్రైజ్ ఫర్ ఇంటీరియర్ గుర్తింపును కూడా ఈ టర్మినల్ సొంతం చేసుకుంది. దేశీయ ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులు ఈ టర్మినల్ ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు.
ప్రయాణికులకు ఓ సంపూర్ణమైన ప్రయాణానుభూతిని ఇచ్చేందుకు రూ. 5 వేల కోట్లతో దీన్ని నిర్మించారు. లోపలి ప్రదేశమంతా పచ్చని తోటలను మరిపించేలా ఇంటీయర్స్‌ను డిజైన్ చేశారు. దీన్ని నగరానికి తలమానికంగా అనేక మంది అభివర్ణిస్తారు. ఇక్కడకు వస్తే ఉద్యానవనంలో ఉన్నట్టు ఉంటుందని అనేక మంది ప్రయాణికులు తమ అనుభవాలను నెట్టింట పంచుకున్నారు. ఈ టర్మినల్ మొత్తం వైశాల్యం 10 వేల పైచిలుకు చదరపు మీటర్లు . ఈ ఏర్పాట్లన్నీటికీ స్వదేశీ సాంకేతికతను వినియోగించడం కొసమెరుపు.
దాడులకు ప్రతి దాడులు ఉంటాయి..జగ్గారెడ్డి
కలెక్టర్‌ను చంపాలని బీఆర్‌ఎస్ కుట్ర చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కలెక్టర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఆయనన కాపాడారన్నారు..గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పథకం ప్రకారమే కలెక్టర్‌పై దాడి జరిగిందన్నారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలపై బీఆర్ఎస్ దాడులు చేసిందన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలతో అధికారులపై దాడులు చేస్తున్నారు. దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ నేతలకు మా తడాకా ఏంటో చూపిస్తాం” అంటూ హెచ్చరించారు.
మరోవైపు, బీఆర్‌ఎస్ అరాచక శక్తులతో కలిసి కుట్రపూరితంగా దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తలకిందులుగా తపస్సు చేసినా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరని చెప్పారు. లగచర్ల ఘటనలో నిందితుల కాల్ డేటాను సేకరించగా, బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు తేలిందన్నారు. దీని వెనుక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు..
ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో బీజేపీకి షాక్..
గురువారం హోరాహోరీగా జరిగిన ఢిల్లీ నగర మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై విజయం సాధించింది. 256 ఓట్లలో 133 ఓట్లు ఆప్ అభ్యర్థి మహేశ్ ఖిచికి లభించగా, ఆయన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌కు 130 ఓట్లు లభించాయి.రెండు ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. మేయర్ ఎన్నికల్లో ఓటమితో డిప్యూటీ మేయర్ ఎన్నికల నుంచి బీజేపీ వైదొలగింది. ఫలితంగా, డిప్యూటీ మేయర్ పదవిని ఆప్ అభ్యర్థి రవీందర్ భరద్వాజ్ సొంతం చేసుకున్నారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న తరుణంలో ఈ విజయాలు గొప్ప సంతోషాన్ని ఇచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పారు.
దళితుడు మేయర్ కావడంతో ఆప్ కౌన్సిలర్లు జై భీమ్ అని నినాదాలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ కౌన్సిలర్లు 8 మంది క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఆప్ ఆరోపించింది. వీరి ఓట్లతోనే బీజేపీ బలం పెరిగిందని పేర్కొంది. ఈ ఓటింగ్‌కు కాంగ్రెస్ కౌన్సిలర్లు (ఏడుగురు) దూరంగా ఉన్నారు..