నాలుగో టీ20లో టీమిండియా భారీ విజయం..సిరీస్ కైవసం.!.

India vs South Africa

దక్షిణాఫ్రికా పై నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 135 రన్స్‌ తేడాతో సఫారీలపై విజయం సాధించింది. నాలుగు టీ 20 మ్యాచ్‌ ల సిరీస్‌ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. జొహనెస్‌బర్గ్‌ లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌ లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 283 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌ అద్భుత సెంచరీలతో కొత్త రికార్డులు నెలకొల్పారు. 284 పరుగుల భారీ టార్గెట్‌ చేదించేందుకు బ్యాటింగ్‌ కు సఫారీ టీమ్‌ మొదట్లోనే తడబడింది. పది పరుగులకే మొదటి నాలుగు వికెట్లు కోల్పోయింది. స్టబ్స్‌, డేవిడ్‌ మిల్లర్‌ కాసేపు మెరుపులు మెరిపించినా టార్గెట్‌ భారీ గా ఉండటంతో రన్స్‌ కొట్టే క్రమంలో వికెట్లు సమర్పించుకున్నారు..
India vs South Africa.
10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా..

డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ కలిసి ఐదో వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే ఈ ఇద్దరూ వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్‌ని వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు..

29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్‌ని రవి భిష్ణోయ్ అవుట్ చేశాడు. అండిలే సిమలాగే 2, గెరాల్డ్ కాట్జే 12 పరుగులు, కేశవ్ మహరాజ్ 6 పరుగులు, సింపలా 3 పరుగులు చేసి అవుట్ అయ్యారు. గత మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేసిన మార్కో జాన్సన్, నేటి మ్యాచ్‌లో కూడా మెరుపులు మెరిపించాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు సంజూ శాంసన్, తిలక్ వర్మ సెంచరీలు చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగుల రికార్డు స్కోరు చేసింది.. 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36 పరుగులు చేసి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా బౌలర్లు వికెట్ తీయలేకపోయారు. సంజూ శాంసన్, తిలక్ వర్మ ఇచ్చిన క్యాచులను సౌతాఫ్రికా ఫీల్డర్లు జారవిరచడంతో ఇద్దరు బ్యాటర్లు చెలరేగిపోయారు. తొలి టీ20లో సెంచరీ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన సంజూ శాంసన్, 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒకే ఏడాదిలో 3 టీ20 సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సంజూ శాంసన్..

గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన తిలక్ వర్మ, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ అందుకున్నాడు. సంజూ శాంసన్ తర్వాత టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు తిలక్ వర్మ.. సంజూ శాంసన్, తిలక్ వర్మ కలిసి 210 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. భారత జట్టుకి టీ20ల్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం..

సంజూ శాంసన్ 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 109 పరుగులు చేయగా తిలక్ వర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 పరుగులు చేశాడు…

రికార్డు భాగస్వామ్యం.. తిలక్ వర్మ, సంజూ శాంసన్ సెంచరీల మోత

టీమిండియా ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ సంజు శాంసన్‌(109), హైదరాబాద్‌ స్టార్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ(120) అజేయ సెంచరీలతో మెరిసారు. ఇద్దరు భారత బ్యాటర్లు ఒకే టి20లో శతకాలు బాదడం ఇదే తొలిసారిగా.. 2వ వికెట్‌కు వీరు ఏకంగా 210పరుగులు జతచేసి రికార్డు నెలకొల్పారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 283పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది.

సెంచరీల మోత…

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 283 పరుగులు చేసింది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ సెంచరీలతో సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫోర్లు, సిక్సర్లతో బెంబేలెత్తించారు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 41 బంతుల్లోనే సెంచరీ సాధించగా, సంజూ శాంసన్‌ 51 బాల్స్‌లో సెంచరీ చేశాడు.

23 సిక్సర్లు…

మొత్తంగా ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 47 బాల్స్‌లో తొమ్మిది ఫోర్లు పది సిక్సర్లతో 120 పరుగులు చేయగా…సంజూ శాంసన్ 56 బాల్స్‌లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 109 పరుగులు చేశారు. వీరిద్దరు నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు కలిసి 23 సిక్సర్లు కొట్టారు. టీ20 క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో టీమిండియా కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే కావడం గమనార్హం..

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ తిలక్ వర్మ…

సంజూ శాంసన్‌, తిలక్ వర్మ జోడిని విడదీసేందుకు సౌతాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. పోటీపడి సౌతాఫ్రికా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. ఈ సిరీస్‌లో రెండో టీ20లో మాత్రమే సౌతాఫ్రికా విజయం సాధించగా…మిగిలిన మూడు మ్యాచుల్లో టీమిండియా గెలుపును సొంతం చేసుకున్నది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ రెండు అవార్డులు తిలక్ వర్మకే దక్కాయి.