మాయమాటలతో అధికారంలోకి రాలేదు..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఇందిరమ్మ రాజ్యంలో సంతోషంగా ప్రజలు
డిసెంబరులోపు రుణమాఫీని పూర్తి చేస్తాం
జనవరి నుంచి రేషన్ ద్వారా సన్న బియ్యం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భైంసా రూరల్, కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి రాలేదని, రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన.. మార్గమధ్యలో నిర్మల్ జిల్లా భైంసాలో మాజీ ఎమ్మెల్యే భోంస్లే నారాయణ్ పటేల్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు రూ.8.34లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాటేగాం గ్రామానికి వెళ్లి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజా సేవకులుగా పని చేస్తున్నారన్నారు. ఆరు గ్యారంటీలను నెరవేర్చి తీరుతామని పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతులకు డిసెంబరు లోపు మాఫీ చేస్తామని పొంగులేటి చెప్పారు. తెల్ల రేషన్ కార్డులున్నవారికి జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోనూ ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆయన ఆకాంక్షించారు…
*హృదయ విచారకర సంఘటన….మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి!*
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
చిల్డ్రన్స్ వార్డు (ఎన్ఐసియు)లో మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో పలువురు చిన్నారులు కాలిపోయినట్లు సమాచారం. లోపల నుంచి 10 మంది చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు.
మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
సమాచారం అందుకున్న జిల్లా అధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.
ఝాన్సీ డీఎం అవినాష్ కుమార్ మాట్లాడుతూ.. సంఘటనా స్థలంలో ఉన్న సిబ్బందికి అందిన సమాచారం మేరకు ఉదయం 10:30 నుంచి 10:45 గంటల మధ్య ఎన్ఐసీయూ లోపలి యూనిట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. NICUలో రెండు వార్డులు ఉన్నాయి. బయట వార్డులో ఉన్న పిల్లలంతా సురక్షితంగా బయటపడ్డారు. 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. చాలా మంది చిన్నారులు గాయపడ్డారు. అందరూ చికిత్స పొందుతున్నారు.
పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
బ్యాడ్జిల్లో TSP స్థానంలో TGP, తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్, TSSP స్థానంలో TGSP, TSPS స్థానంలో TGPS ఉండే విధంగా బ్యాడ్జిలను మార్చాలని హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ..
న్యూజిలాండ్ పార్లమెంట్లో ఎంపీల డ్యాన్స్
ట్రీటీ ప్రిన్సిపల్స్ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో వినూత్న నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపీలు.
బిల్లును చించేసి మావోరి నృత్యం చేసిన యువ మహిళా ఎంపీ హనా రాహితి కరేరికి మైపి క్లార్క్.
అమెను అనుసరించిన మరికొందరు ఎంపీలు.
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
తిరుమలలో ఎమ్మెల్యే కోటా పెంపు – దర్శనం, సేవల్లో ఇక ఇలా..!!.
ఏమ్మెల్యేల చిరకాల కోరిక నెర వేరుతోంది. తిరుమలలో తమ సిఫార్సు లేఖల కోటా పెంచాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశాల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
దీని పైన సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శన, సేవల్లో ఎమ్మెల్యే కోటా పెంపుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బోర్డు సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.
ఎమ్మెల్యేల కోటాలో..
తిరుమలలో శ్రీవారి దర్శనం కు సంబంధించి తమ కోటా పెంచాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. ఇప్పుడు కొత్త బోర్డు ఏర్పాటు తరువాత ప్రభుత్వం ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు కు ఎమ్మెల్యేల అభ్యర్ధన మేరకు ఆమోదం తెలిపారు. ఈ నెల 18న జరిగే టీటీడీ నూతన బోర్డు తొలి పాలక మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల కోటా పరిమితిని పెంచనున్నారు. ఇక పై వారంలో ఆరు రోజులు పాటు, రోజుకి ఆరు చొప్పున సుపథం (రూ.300 టికెట్లు) ఇవ్వనున్నారు.
బోర్డు సమావేశంలో ఆమోదం.
తిరుమల దర్శనాలకు సంబంధించి ప్రస్తుతం వారంలో నాలుగు రోజులపాటు ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని అనుమతిస్తున్నారు. తాజా నిర్ణయం మేరకు ఇకపై వాటిని ఆరు రోజులకు అనుమతించనున్నారు. అదే విధంగా సేవల్లోనూ వారి కోటా ఉండే విధంగా మార్పులకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు సైతం తమ లేఖల గురించి ఏపీ ప్రభుత్వానికి చేసిన వినతుల పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా.. దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శన విధానంలో పాత విధానాలు పునరుద్దరించే అవకాశాలు ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులకు 2008లో దివ్య దర్శనం పేరిట టోకెన్లను ఇచ్చేవారు.
పాత విధానంలోనే.
అలిపిరి మార్గంలో రోజుకు 14 వేల టోకెన్లు, శ్రీవారి మెట్టులో 6 వేలు జారీ చేయాలని 2017లో నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ పేరుతో గతంలో వాటిని నిలిపేసింది. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లను ఇస్తోంది. అలిపిరిలోనూ వీటిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటుగా గతంలో తిరుపతిలోని శ్రీనివాసంలో రోజుకు 1,500 చొప్పున స్పెషల్ ప్రవేశ దర్శనం ఎస్ఈడీ టికెట్లను జారీ చేసేవారు. ప్రతి ధర్మకర్తల మండలి సభ్యులకు రోజుకు 20 టికెట్లను ఇచ్చేవారు. ప్రస్తుత పాలక వర్గం గతంలోని టికెట్ల ప్రక్రియను పునరుద్ధరిస్తుందని తెలుస్తోంది. తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు…
*పోలీసుకు నకిలీ పోలీసు వీడియో కాల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!*
HYD పోలీసు హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతున్నా అంటూ ఓ నకిలీ పోలీసు కేరళ సైబర్ పోలీసుకు ఫోన్ చేశాడు. ఈ విషయం అతనికి తెలియక మీరెక్కడున్నారు? అంటూ ప్రశ్నించాడు. తీరా కేరళ పోలీసు వీడియోలో తన యూనిఫాం చూపించడంతో నకిలీ పోలీసుకు ఏం చేయాలో పాలుపోలేదు. అంతేకాకుండా అప్పటికప్పుడు అతని లొకేషన్ వివరాలు చెప్పే సరికి నకిలీ పోలీసు కంగుతిన్నాడు. తదుపరి వివరాలను త్రిసూర్ పోలీసులు ఇంకా వెల్లడించలేదు..
*ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత*.
ఢిల్లీలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. వెస్ట్ ఢిల్లీ లోని జనక్పురీ, నంగ్లోయ్లో లో 900 కోట్లు విలువైన 80 KGల కొకైన్ ను నార్కోటిక్స్ అధికారులు పట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఈ కన్సైన్మెంట్ను సీజ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి
అమిత్ షా ధ్రువీకరిస్తూ డ్రగ్స్ రాకెట్‌పై నిర్దాక్షిణ్యంగా వేట సాగిస్తామని పేర్కొన్నారు.అలాగే అధికారులను అభినందించారు..
బీజేపీది ద్వంద్వ వైఖరి-ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.
మూసీ ప్రజల ఇబ్బందులు తెలుసుకోవాలి
కిషన్‌రెడ్డి సామాన్యవ్యక్తిలా మూసీయాత్రకు వెళ్లాలి
రాజకీయ విమర్శల కోసం మూసీకి వెళ్లడం తగదు
మూడు నెలల పాటు అక్కడే ఉండాలి..బీజేపీ నేతల మూసీ నిద్ర తర్వాత వారి బాధలేంటో..ప్రభుత్వం దృష్టికి తెస్తేచర్యలు తీసుకుంటాం అన్నారు..
*🔹సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్..!*
తెలంగాణాలో కులగణన పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు..
_కార్యకర్తల వెంబడి ఉండి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలుగా గెలిపిస్తామని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ ఆలస్యమైందని, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ పై దాడి చేస్తే చర్యలు తీసుకోవద్దా? అని ప్రశ్నించారు..
*పాపం…ఎదురుగా డ్రంకన్ డ్రైవ్.. పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు..!*
ఒక్కోసారి మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. అసలు మద్యం తాగి వాహనం నడపడమే అతి పెద్ద తప్పు.
పోలీసులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు…
హైదరాబాద్ నగరం శంషాబాద్ ఫ్లైఓవర్ పై అర్ధరాత్రి ఓ యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి వాహనం నడుపుతూ వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఆ మార్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండడం గమనించాడు. ఒకవేళ పోలీసులకు దొరికిపోతే ఫైన్, పోలీసు కేసు అంటూ ఎందుకీ తలనొప్పి అనుకున్నాడో ఏమో..! దారి మళ్లించి రాంగ్ రూట్లో వెళ్తూ ఓ కారును ఢీకొట్టాడు.
రాంగ్ రూట్లో బైక్‌పై వేగంగా వచ్చిన యువకుడు కారును బలంగా ఢీకొట్టాడు. స్పీడ్‌గా రావడం వల్ల ప్రమాదం పెద్దగానే జరిగింది. దీంతో అక్కడికక్కడే ఆ యువకుడు మృతి చెందాడు. సదరు వ్యక్తి తాగిన మైకంలో పోలీసులను చూసి భయాందోళనలకు గురై రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడమే ఇంతటి అనర్ధానికి కారణం…
*ఇతర రాష్ట్రాల వృద్ధులకూ.. ఆర్టీసీ ఛార్జీలో 25% రాయితీ వర్తింపు*
• ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అమలుచేస్తున్న టికెట్ ఛార్జీలోని 25% రాయితీ.. ఏ రాష్ట్రం వారికైనా వర్తిస్తుందని యాజమాన్యం స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీచేసింది.
• ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్ కార్డుల్లో.. ఏదైనా, ఏ రాష్ట్రంలో జారీచేసినా సరే..
• వాటి ఆధారంగా రాయితీ వర్తింపజేయాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) అప్పలరాజు అన్ని జిల్లాల అధికారులు, 4 జోన్ల ఈడీలకు ఆదేశాలు జారీ చేశారు…
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్..
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఎన్‌కౌంటర్‌ను పోలీసు సూపరింటెండెంట్ ఐకె ఎలిసెలా ధృవీకరించారు..
కోర్ ఏరియా కావడంతో సైనికులు సంప్రదించలేకపోతున్నారు.
కంకేర్ నక్సలైట్ ఎన్కౌంటర్లో చాలా మంది నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్ కౌంటర్ కొనసాగుతోంది…
*తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు*
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారిలో 10 శాతం మినహా.. 90 శాతం వరకు రైళ్లలోనే వెళ్తారు. ఇప్పటికే చాలామంది ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నా రు. ఇంకా ఎంతోమందికి టికెట్లు లభించలేదు. వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది…
*తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భక్తుల రద్దీకి తగ్గట్టుగా స్పెషల్ రైళ్లనుఏర్పాటు చేసింది,సౌత్ సెంట్రల్ రైల్వే*
ఇప్పటికే శబరిమలకు అనేక ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. తాజా మరో 8 స్పెష ల్ ట్రైన్స్‌ను నడపనున్నట్టు వెల్లడించింది.
ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి -కొల్లాం, ఈనెల 24, డిసెంబర్ 1వ తేదీల్లో కొల్లాం- మౌలాలి, నవంబర్ 18, 25 తేదీల్లో మచిలీ పట్నం- కొల్లాం, నవంబర్ 20, 27 తేదీల్లో కొల్లాం- మచిలీపట్నం మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.
భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని రైల్వే అధికారులు సూచించారు..
*Group-3 Exams..
రేపు, ఎల్లుండి గ్రూప్-3 పరీక్షలు.. హాజరుకానున్న 5.36 లక్షల అభ్యర్థులు..!!*
రాష్ట్ర వ్యాప్తంగా1,401 కేంద్రాలు.
Group-3 Exams. ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రూప్-3 పరీక్షలు ఆది, సోమవారాల్లో జరగనున్నాయి.
పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, 1,401 కేంద్రాలను ఏర్పాటు చేసింది.
పరీక్షల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించారు. మొత్తం మూడు పేపర్లు ఉండగా మూడు సెషన్లలో పరీక్ష జరగనున్నది. ఆదివారం ఉదయం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, సోమవారం ఉదయం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్షను నిర్వహిస్తారు..
రామ్మూర్తి నాయుడు మృతి దిగ్భ్రాంతికరం..: రేవంత్ .
ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన రేవంత్…
*సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు*
* మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న ముఖ్యమంత్రి వాహనాన్ని ఆపి బ్యాగులు చెక్ చేసిన పోలీసులు.
* ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఇటీవల ఉద్దవ్ ఠాక్రే విమర్శలు చేయడంతో పోలీసులు ముమ్మురంగా తనిఖీలు చేస్తున్నారు.
* కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ సైతం తనిఖీ చేసిన విషయం తెలిసిందే!