ఏఆర్ రెహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్..!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన మ్యూజిక్ కంపోజింగ్, సింగింగ్ టాలెంట్ తో యావత్ భారతదేశం వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రెహమాన్ బార్య సైరా భాను తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి సైరా భాను రెహమాన్ నుంచి విడిపోతున్నట్లు ధ్రువీకరిస్తూ ప్రతికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా రెహమాన్, సైరాబాను వివాహిక జీవితానికి 29సంవత్సరాలు పూర్తయ్యాయి. సుమారు 3 దశాబ్ద కాలం తర్వాత జంట విడిపోవడం ఇప్పుడు వైరల్ అవుతోంది..