హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల మంజూరి చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి....
R9TELUGUNEWS.COM.
హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో ఓ.పి బ్లాక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
పార్కింగ్ షెడ్,ధోభీ ఘాట్ లతో పాటు అదనపు ట్రాన్స్ ఫార్మర్ల మంజూరు.
3.60 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..
హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఓ.పి.బ్లాక్ నిర్మాణానికి రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేయించారు…అంతే కాకుండా ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ షెడ్ తో పాటు,దోబీ ఘాట్ నిర్మాణం, అదనపు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటుకు ఆయన నిధులు మంజూరు చేయించారు..మంత్రి ఉత్తమ్ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల 60 లక్షల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి క్యాంపు కార్యాలయం నుండి పత్రిక ప్రకటన చెయ్యడం జరిగింది…
సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి..బీసీ నేతధనుంజయ నాయుడు….

R9TELUGUNEWS.COM
సంచార జాతులకు మరియు ఎంబీసీలకు ప్రత్యేకముగా రిజర్వేషన్లను వారి జనాభా నిష్పత్తిలో వర్గీకరించి అమలు చేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు ఆయన హుజూర్ నగర్ లో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్ పట్టణ సిపిఐ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు మామిడి నర్సయ్యతో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ… బీసీల రాజకీయ రిజర్వేషన్ల కొరకు దశాబ్దాల కాలంగా వివిధ రూపాల్లో ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ పాలకుల చెవికి ఎక్కడoలేదని, ఏనాడో బ్రిటిష్ కాలంలో బీసీ కులగణను జరిపారని, కుల గణన జరపాలని బీసీ సంఘాలు చేసిన ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం ముందుకు రావడానికి హర్షిస్తున్నామని, స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని ఇప్పుడు 23% రిజర్వేషన్ బీసీ జనాభాకు ఏమాత్రం సరిపోదని 50% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని వార్షిక బడ్జెట్లో ప్రతి వార్షిక సంవత్సరం 50% బడ్జెట్ ను బీసీలకు కేటాయించాలని , ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని నాలుగు శాతంజనాభా లేని వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీలు అత్యధిక నష్టపోతున్నారని కావున ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను పునః పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు..
మాలల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ.
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నియోజకవర్గ కన్వీనర్ దగ్గుపాటి బాబురావు అధ్యక్షతన..
R9TELUGUNEWS.COM

హుజూర్ నగర్ లోని టౌన్ హాల్ లో ఎస్సీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నియోజకవర్గ కన్వీనర్ దగ్గుపాటి బాబురావు అధ్యక్షతన వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమావేశం ఏర్పాటు చేసి మాలల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ
డిసెంబర్1 న హైదరాబాద్ లో జరిగే మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని మాలల ఆత్మగౌరవం కోసం తమ ఉనికి కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని ఎందులో తాము తీసుకోమని మాలలు మాలల అశ్విత్వని కి ఉనికి ప్రమాదం వాటిల్లుతుంది కావున డిసెంబర్ 1 మాలల సింహ గర్జన కు విజయవంతం చేయాలన్నారు..
మాలల ఐక్యాత సాటి చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో, మాల కుటుంబ సభ్యులు,ఇట్టి మల్ల బెంజిమెన్, గొట్టిముక్కల రాములు, కోల్లపూడి దయాకర్,ఇట్టి మల్ల శీను, సప్పిడి సావిత్రి,దాసరి పున్నయ్య, పెద్ద మాలలు, కుడిచేటి ఇర్మియ, మామిడి ఇమ్మానియేల్, కోల్లపూడి ఏసురత్నం,సప్పిడి సైదులు, పాలడుగు రాజు, బొప్పన రాజు,బండి భాస్కర్, బొల్లెద్దు అరుణ్, పాశం నరసింహారావు, గొబ్బి రాము,ఇట్టి మల్ల వినోదు, మాడుగుల దశరథ్,కామల్ల రాజా, కోల్లపూడి ప్రవీణ్,కోల్లపూడి రవి రమేష్, కుడి తెట్టి జగన్, కుడిచెట్టి కళ్యాణ్,కోల్లపూడి కర్ణాకర్, ఈసం రాములు, తదితరులు పాల్గొనడం జరిగింది..
కృష్ణమ్మకు హారతి ..

R9TELUGUNEWS.COM.
మఠంపల్లి మండలం మట్టపల్లి..
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహాక్షేత్రం నందు ఈ రోజు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు, కృష్ణ హారతి దేవాలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజినేయచార్యులు వార్లచే శాస్త్రోతముగా నిర్వహించబడినది..
వైభవంగా శివాలయంలో లక్ష తులసి పూజ..

R9TELUGUNEWS.COM ..
హుజూర్ నగర్ టౌన్..
అతి పురాతనమై, కాకతీయుల కాలంనాటి స్థానిక రామాలయంలో కార్తీకమాసం సందర్భంగా లక్ష తులసి పూజ వైభవంగా జరిగింది. ప్రాతః కారార్చన జరిపి లక్ష తులసిని పట్టణ పురవీధుల గుండా మేళ తాళాలతో ఊరేగింపు చేశారు.శ్రీ వేణుగోపాలస్వామినీ, గోదాదేవి మూలమూర్తులకు పంచామృతాలతో, పంచసూక్తలతో అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలతో, పూలు, తులసి మాలలతో అలంకరించి మండపంలో భద్ర పీఠంపై వేంచేసి అర్చక స్వాములు లక్ష తులసి అర్చన జరిపారు. పదిమంది రుత్వికులు విష్ణు సహస్రనామార్చన పారాయణం చేయగా, మరో 10 మంది అర్చక స్వాములు తులసిని స్వామికి అలంకరించారు. ఇట్టి పూజ సందర్భంగా దేవాలయాన్ని పూలదండలతో అందంగా అలంకరింపజేశారు. ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వార్షికంగా రైతు మహిళా భక్త బృందం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఇట్టి కార్యక్రమంలో దేవాలయ ఈ.వో గుజ్జుల కొండారెడ్డి, పశ్య పిచ్చమ్మ, కోట వెంకట రామమ్మ, కోట లక్ష్మీపార్వతి, కోట సూర్యప్రకాష్ రావు, పొనుగుబాటి అశోక్, కంచర్ల అరవింద్ రెడ్డి, అర్చకులు నరసింహాచార్యులు, మురళీ కృష్ణమా చార్యులు, భాస్కరా చార్యులు, దామోదరా చార్యులు,mvn అచార్యులు,జగన్నాథ చార్యులు, మొదలవారు పాల్గొన్నారు….
గోమాత కు ప్రత్యేక పూజలు..!
హుజూర్నగర్ మండలం బూరుగడ్డ.
శ్రీ ఆది వరాహ లక్ష్మి నరసింహ వేణుగోపాల స్వామి దివ్య క్షేత్రము బూరుగడ్డ లో ప్రతి శుక్రవారం గోపూజ కార్యక్రమం జరుగును,

కార్తీక మాసం మూడవ శుక్రవారం సందర్భంగా.
R9TELUGUNEWS.COM
ఉదయం 10 గంటలకు గోపూజ కార్యక్రమం జరిగినది, అనంతరం దేవాలయంలో అత్యంత వైభవంగా భజన కార్యక్రమం జరిగినది,..
ఈరోజు గోపూజ కు సహకరించిన భక్తులు కీసర దేవేంద్ర చారి దంపతులు, జనిగల శ్రీనివాస్ గౌడ్ దంపతులు, కత్తెరసాల సతీష్ దంపతులు, మొరిశెట్టి ఉపేందర్ రావు దంపతులు, జూలకంటి ఉపేందర్ దంపతులు, మంచాల శ్రీధర్ దంపతులు, ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ యరగాని గురవయ్య, ధర్మకర్తలు తిపిరిశెట్టి హరీష్, కోల కృష్ణ ప్రసాద్, గంధం అంజయ్య, వేముల నరసింహారావు, పెనుబేల్లి హనుమంతరావు, మెరిగ కవిత,
ఆలయ అర్చకులు హరీష్ కుమారా చార్యులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎంపీ లక్ష్మణరావు, మరియు వినయ్, చంద్, అనసూర్యమ్మ, నాగమణి, బాల అన్నపూర్ణ, పద్మ, విజయలక్ష్మి, సునీత, శైలజ, మరియు ఆలయ సిబ్బంది,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు..