🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 24 – 11 – 2024,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,
తిథి : నవమి రా11.37 వరకు,
నక్షత్రం : పుబ్బ రా12.20 వరకు,
యోగం : వైధృతి మ3.17 వరకు,
కరణం : తైతుల ఉ10.53 వరకు,
తదుపరి గరజి రా11.37 వరకు,
వర్జ్యం : ఉ7.01 – 8.45,
దుర్ముహూర్తము : మ3.51 – 4.35,
అమృతకాలం : సా5.25 – 7.09,
రాహుకాలం : సా4 30 – 6.00,
యమగండం : మ12.00 – 1.30,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 6.13,
సూర్యాస్తమయం: 5.20,
*_నేటి మాట_*
*భజన ఎందుకు చేయాలి??*
భజన అనేది చాలా ఎంతో ప్రాముఖ్యతతో గూడినది,
భజనలో పాల్గొని మనం చప్పట్లు కొట్టినప్పుడు చెట్టుపై ఉన్న పక్షులు అదృశ్యమైనట్లే, నిరంతరం భజన చేయడం వల్ల, మన్లోపాలి అవాంచనీయ కోరికలు, నిరాశ, దురాశ వంటి అవాంఛనీయ గుణాలు మాయమవుతాయి.
“మరి పక్షులు ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకు వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉంటుంది,
కానీ నిరాశ మరియు దురాశ ఎక్కడికి పోతుంది?” అనే సందేహం కలుగొచ్చు…
…మనం భజనకు హాజరయ్యేందుకు శక్తి, ఆసక్తి మరియు అవకాశం ఉన్నప్పటికి ” ఎవరైతో వెళ్ళరో నేరుగా వారి వద్దకు వెళ్లి వారిని పట్టుకుని వేధిస్తూ వుంటాయట” కాబట్టి ఈ కలియుగంలో నామ్స్మరణకు చాలా ప్రాముఖ్యత ఉంది,
కానీ మనం చేసే భజన నలుగురి మెప్పు కోసమో, లేదా పరుల ఆనందం కోసమో వుండకూడదు, భగవంతుని అనుగ్రహము కోసమే చేయాలి…
*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏