ఘనంగా బద్రావతి భావన ఋషి దేవాలయ 16 రోజుల పండుగ..
R9TELUGUNEWS.COM.
మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి కుల బాంధవులు, గ్రామ పెద్దలు..

మేళ్లచెరువు మండల కేంద్రంలో శివాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించినటువంటి మార్కండేయ సహిత బద్రావతి బావనారుషి దేవాలయ 16 రోజుల పండుగను వేదమూర్తులు త్రిశత్యాత్మక మాతా చారిటబుల్ ట్రస్ట్ కొంకపాక రాధాకృష్ణమూర్తి, బానుకిరణ్ శర్మ కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ, శివ ధనంజయ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, కలశపూజ ,హోమాధి కార్యక్రమంలు నిర్వహించడం జరిగింది. తదనంతరం భద్రావతి భావన ఋషి విగ్రహ మూర్తులకు అభిషేకాధి కార్యక్రమంలు నిర్వహించడం జరిగింది, పూజా కార్యక్రమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు,గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాతలు గజ్జల శంకర్ రెడ్డిగారు,బచ్చు శ్రీనివాస్ రెడ్డి , కాకునూరి వెంకటరెడ్డి,ఎన్టీవీ త్రిపురం నరసింహారెడ్డి, మేల్లచెరువు మండల ఎమ్మార్వో జ్యోతి,ఎస్బిఐ మేనేజర్ మురళి,హుజూర్నగర్ నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులు గుర్రం మార్కండేయ, చిన్నం వీరమల్లుగారు, కొంగర నరసింహారావుగారు, సంగిశెట్టి గోపాల్, గోలి నాగరాజు, గోలి శ్రీను, పిల్లలమర్రి పుల్లారావు, పెండెం రాములు, భద్రావతి భావన ఋషి దేవాలయ చైర్మన్ సామిలేటి రంగారావు, మామిడి కొండలు, మిట్ట కోలు సాయికుమార్, అవ్వారు రాజు, పి.శ్రీనివాసరావు, జి.నరేష్, సిహెచ్.శివ, ఎం.గణేష్, ఎం.నరేష్, వై.మధు, చందు,శశి,రమేష్ , నరేందర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు..
రహదారి భద్రత పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.ఎస్సై ముత్తయ్య.

*హుజూర్ నగర్..
R9TELUGUNEWS.COM
రహదారి భద్రతను పాటించాల్సిన బాధ్యత ఎస్సై ముత్తయ్య, ప్రిన్సిపల్ పోసాని వెంకటరమణారావు అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఆధ్వర్యం లో *సేఫ్ ఇండియా* అనే అంశంపై గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి రోడ్డు ప్రమా దాలను నివారించాలని సూచించారు. స్వయంకృతాపరాధం వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. మైనర్ల డ్రైవింగ్ ఫై పోలీసుశాఖ దృష్టి సారించిందని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించడంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది అని తెలిపారు. వాహనదారులకు గులాబీ పూలను అందించి హెల్మెట్ ధరించాలని విద్యార్థులు కోరారు.డీన్ ప్రేమ్ సాగర్, ASI రమేష్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు..
ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ అంటే అర్థమేమిటో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి..బిఆర్ఎస్ నేత రాపోలు నవీన్ ఘాటు.

R9TELUGUNEWS.COM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గాల్లో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలను అటహాసంగా నిర్వహిస్తున్నారు దానికి సరైన సమాధానం ప్రజలకు చెప్పాలని
నెలాఖరు వచ్చినా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఇచ్చే పెన్షన్ కు దిక్కు ముక్కు లేకుండా పోయిందని బిఆర్ఎస్ నేత రాపోలు నవీన్ ఘాటుగా విమర్శించారు.
గురువారం నాడు ఆయన దిర్శించర్ల లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పింఛన్ కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులను,వికలాంగులను, వితంతువులను పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ….
అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ని రెట్టింపు చేసి నెలకు 4000 ఇస్తామని వికలాంగులకు 6000 చేస్తామని ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రకటించి ఎన్నికల్లో లబ్ధి పొందగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఆసరా పెన్షన్ దారులను ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆయన అన్నారు.
ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక, మంత్రులు తప్పించుకు తిరుగుతున్నారని 28వ తారీకు వచ్చినా నేటికీ పెన్షన్ ఇవ్వకపోవడం ఏమిటని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు మరియు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులందరూ ఒకటవ తేదీనే లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని కానీ పేదవారికి ఇచ్చే 2000 రూపాయలు ప్రభుత్వ దగ్గర లేవా అని ఆయన ప్రశ్నించారు.
ప్రతినెలా ఒకటవ తేదీ నుంచి 5వ తేదీ వరకు లబ్ధిదారులకు పెన్షన్ అందించాలని ఎన్నికల్లో వాగ్దానం చేసిన మాదిరిగా పెన్షన్లు రెట్టింపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు..బి.అర్.యస్.కెవి మండల అధ్యక్షులు కనకరాజుల రాంబాబు సీనియర్ నాయకులు జీలకర్ర రామస్వామి, మహిళా నాయకురాలు కాసాని అంజమ్మ తదితరులు పాల్గొన్నారు..
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ..

మఠంపల్లి మండలం..
R9TELUGUNEWS.COM.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అంజలి పురం మాజీ సర్పంచ్ కుందూరు పాపిరెడ్డి కి అందజేయటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో హుజూర్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చక్కర వీరారెడ్డి పాల్గొనడం జరిగింది.. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని,, నిరుపేదలకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగానే ఉంటుందని తెలిపారు.. చెక్క అందజేసిన వారిలో మఠంపల్లి మాజీ సర్పంచ్ కిషోర్ రెడ్డి,అల్లిపురం మాజీ సర్పంచ్ భోగాల పిచ్చి రెడ్డి,, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు గంగసాని ఎల్లారెడ్డి. తదితరులు పాల్గొన్నారు..
రైస్ మిల్లర్స్ డ్రైవర్స్ వేతన అలవెన్సులు తక్షణమే పెంచాలి..

హుజూర్ నగర్ రైస్ మిల్లర్స్ డ్రైవర్స్ వేతన అలవెన్సులు తక్షణమే పెంచాలని టియన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి కోరారు
హుజూర్నగర్ బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలిశెట్టి లక్ష్మీనరసింహారావు కు రైస్ మిల్ డ్రైవర్ రెండవ నోటీసు ఇచ్చిన అనంతరం రోషపతి మాట్లాడుతూ గతనెల 31,10,24 నాటికి పూర్తి అయినందున తిరిగి అగ్రిమెంట్ చేయక పోవటం విచారకరం ము అన్నారు ..ఈ కార్యక్రమంలో రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు గుండేబోయిన ఎంకన్న రామయ్య శ్రీను అంజయ్య నాగయ్య తదితరులు పాల్గొన్నారు…
Sc వర్గీకరణ వెతిరేకపోరాట సమితి గ్రామ శాఖ ఎన్నిక.

R9TELUGUNEWS.COM.
Sc వర్గీకరణ వెతిరేకపోరాట సమితి గ్రామ శాఖ ఎన్నిక…హుజుర్ నగర్ నియోజకవర్గం కన్వీనర్. దగ్గుపాటి. బాబురావు. గరిడేపల్లి మండలం ఇంచార్జి లు , వనపట్ల. రమేష్, కందుల. జానయ్య, కామల్ల. అంతోని, కట్టా. నాగరాజు, జంగం. కోటేశ్వరరావు మరియు గ్రామ పెద్ద మాల, బోయిల్ల. మరియన్న ఆధ్వర్యంలో గ్రామ అద్దెక్షుడు బోయిల్ల. కరుణాకర్, ఉపాధక్షడు. దాసరి. పాపయ్య, ప్రధాన కార్యదర్శి. కట్టా. బాబు, సహాయ కార్యదర్సులు, మేక. అంతోని, బోయిల్ల.సులేమాన్, కోశాధికారి బోయిల్ల. బాలస్వామి, సహాయ కోశాధికారి బోయిల్ల. దొర్నిస్ లను ఏకగ్రీవంగా వెన్నుకున్నారు. డిసెంబర్ 1వ తారీకున సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగు, మాలల సింహాగర్జనను విజయవంతం చేయాలి, మాలలకు ఎలాంటి అన్యాయం జరిగిన మాలలు అంత ఐక్యమంత్యంతో వెదురుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో బోయిల్ల లూర్డు, నిర్మల, పవిత్ర, జక్కి సైదులు, జక్కి మరియమ్మ, మేక పద్మ, కట్టా నాగరాజు, కట్టా వెంకటయ్య, కట్టా మాలశ్రీ,బోయిల్ల ప్రకాశం, వీరమ్మ, పుష్పమ్మ, వెంకటమ్మ, గండమళ్ళ పావని,వినోద కోడిరెక్క చంద్రమ్మ, చినమ్మరియన్న, చంటి, శౌరి, జోజి, సైదులు, సుధాకర్, యల్లమ్మ, సైదమ్మ, రాజేష్ ,సన్నీ తదితరులు..
మట్టంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో రోడ్డుపైన ధర్నాకు దిగిన గ్రామస్తులు…!

రోడ్లు గుంతల మాయంగా మారి. దుమ్ము ఇళ్లలోకి వస్తు జబ్బులకు గురవుతున్నామని. ఆందోళన బాట పట్టిన గ్రామస్తులు…
రోడ్డుకు అడ్డంగా ట్రాక్టరు, బైకులు పెట్టిన ధర్నా చేస్తున్న గ్రామస్తులు.
చిరు వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు నడపలేక పోతున్నామని అవేదన…
ఇళ్లల్లోకి దుమ్ముచేరి జబ్బులు పాలవుతున్నామని..
యదేచ్చగా మట్టి లారీలు,, చెరువు కట్టల ఆధునీకరణ పేరుతో అడ్డగోలుగా తిరుగుతున్నాయని అన్నారు..
అధికారులు పట్టించుకోవడంలేదని.
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…
ధర్నాకు దిగిన గ్రామస్తులు..
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా నేటి వరకు కనీసం రోడ్లు మరో చేయలేదని.. కనీసం రోడ్లు వేయకపోతే వేయకపోయారు గానీ , గుంతలు పడిన వాటినైనా కనీసం పోర్చడం కూడా చేతగాని పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రభుత్వం ఉందని ఆరోపించారు…. నిత్యం ఇదే రహదారిపై పదుల సంఖ్యలో బండ్లు జారిపడి తీవ్రస్థాయిలో గాయాలు అవుతున్నట్లు తెలిపారు…. ప్రజా పాలన అంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఘటన, మఠంపల్లి మండలంలోనే ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…. నిత్యం రాత్రి అనకా పగలనకా మట్టి టిప్పర్లు పాటు, ఇండస్ట్రీస్ కు సంబంధించిన లారీలు కూడా వెళ్తుంటాయని,, అటువంటి రద్దీ రోడ్డు ని కనీసం మరమ్మతులు చేయకపోవడంపై స్థానిక అధికారులపై, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…రైతుబంధు ఎగగొట్టి, రుణమాఫీకి సున్నం పెట్టి,.. చిరు వ్యాపారం చేసుకుంటున్న మాపై కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు…దుమ్ముతో తీవ్రస్థాయిలో శ్వాసకోశ వ్యాధులతో పాటు,, చర్మవ్యాధులతో తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.. టిఫిన్ సెంటర్లు కూడా బంద్ చేసి ఇంట్లోనే కూర్చుంటున్నామని.. అయినా కూడా ఇంట్లో కూడా దుమ్ము వచ్చి తీవ్రస్థాయిలో అనారోగ్యం పాలవుతున్నామని.. ప్రభుత్వానికి కనీసం ప్రజలు పడుతున్న ఇబ్బంది అర్థం కావడం లేదంటూ ఇదేమి ప్రజాపాలన అంటూ రోడ్డెక్కి ధర్నాకి దిగినట్లుగా గ్రామస్తులు తెలిపారు.. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోకపోవడంతో రోడ్డుకి అడ్డంగా ట్రాక్టర్లని బండ్లని పెట్టి ధర్నా చేస్తున్నట్టు తెలిపారు.. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి రోడ్లన్నీ బాగు చేయాలని డిమాండ్ చేశారు..