హైకోర్టులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి ఊరట..

హైదరాబాద్‌ : కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే, భారాస నేత పట్నం నరేందర్‌రెడ్డి కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లలో రెండింటిని కోర్టు కొట్టేసింది. లగచర్ల దాడి ఘటనలో బొంరాస్‌పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని నరేందర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. దీనిపై కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసి నేడు ఉత్తర్వులు ఇచ్చింది.