కేరళలో పతనంతిట్ట జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు…!

శబరిమల :

నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కేరళ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు.

శబరిమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం…

పంబ, సన్నిధానంలో ఉదయం నుండి కురుస్తున్న వర్షంతో పంపానదిలో పెరుగుతున్న నీటి ప్రవాహం

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అయ్యప్ప భక్తులు..

జోరు వర్షంలోనే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటున్న భక్తులు..

ఎడతెరిపి లేని వర్షంలో కూడా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు….

ఎన్ డి ఆర్ ఎఫ్, అగ్నిమాపక, రాపిడ్ యాక్షన్ టీం, పోలీస్ సిబ్బంది వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భక్తులను ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలని పతనంతిట్ట కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.

శబరిమలలో కొండల్లో కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో, నదులు, అడవులు ఉన్న ప్రాంతాల్లో భక్తులను అనుమతించరాదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.