ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన..ఏదైనా సమస్య ఉంటే, అత్యవసరవేళ నాకు ఫోన్ చెయ్యండి..!

రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల(Student suicides)పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(KomatiReddy VenkataReddy) ఆవేదన చెందారు..చదువులు పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయవద్దని కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. అలా వ్యవహరిస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పదిరోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తనని తీవ్రంగా కలచి వేసిందని కోమటిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఏదైనా సమస్య ఉంటే, అత్యవసరవేళ తనని సంప్రదించమని ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ ఇచ్చారు. 86880-07954 ఆఫీసు నంబరుకు గాని, minister.randbc@gmail.com ద్వారా గాని తనకి తెలపమని విద్యార్థులకు సూచించారు…..!!!!!