ఝార్ఖండ్లో అత్యంత అరుదైన పాము కనిపించింది. మహాభారతంలో ప్రస్తావించిన తక్షక నాగు ప్రత్యక్షమైంది. రాంచీలోని ఓ ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన ఈ పామును చూసి అధికారులు భయపడిపోయారు. పామును చూసిన ప్రజలు వెంటనే స్నేక్ క్యాచర్ రమేష్ కుమార్ మహతోకు కాల్ చేశారు. ఆయన వచ్చి పామును రక్షించాడు. అయితే స్నేక్ క్యాచర్ పాముతో కాసేపు ఆడుకోవడంతో అక్కడ జనాలు భారీగా గుమిగూడారు. అరుదైన పామును వింతగా వీక్షించారు. ఝార్ఖండ్లో ఇలాంటి పాము కనిపించడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. ఈ పాము విషపూరితమైనదని.. చిన్న బల్లలను తింటుందన్నారు. ..
పురాతన గ్రంథాల్లో ఇలా..
తక్షకుడనే పాము కాటేసినట్లు మహాభారతంలో చదువుకుని వుంటాం. అదే పేరుతో పిలిచే ఓ అరుదైన పాము జార్ఖండ్లోని రాంచీలో కనిపించింది.ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన దాన్ని చూసి అధికారులు కంగారు పడ్డారు. అంతరించిపోతున్న పాముల జాబితాలో ఉన్న తక్షక నాగు చెట్లపై నివసిస్తుంటుంది.
చెట్ల మీది నుంచి చెట్ల మీదకు గాల్లోనే 100 అడుగుల వరకూ ప్రయాణించగలదు. వందల ఏళ్లు బతుకుతుందనేది ఉత్తరాది గ్రామాల్లో ఓ విశ్వాసం.
ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి ఎక్కడి నుంచో చొరబడిన ఆ పామును చూసి అక్కడున్న అధికారులు భయంతో వణికిపోయారు. మామూలు పాములకు భిన్నంగా ఉన్న ఆ సర్పాన్ని చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.