హైదారాబాద్ :
*వీళ్ళ సినిమా పిచ్చి తగలెయ్య…*
దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్ , ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mm కు వచ్చింది…
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు…
ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు..
వెంటనే పోలీసులు విద్యానగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు..
రేవతి అప్పటికే మృతి చెందగా , శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు..
రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు…
హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (39) మృతి చెందింది. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షో చూసేందుకు రేవతి, ఆమె భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్, సన్వీక (7) దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్య థియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో.. హీరో అల్లు అర్జున్ సంధ్య థియటర్ వద్దకువచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు…అల్లు అర్జున్ థియేటర్లోకి వెళ్లాక.. అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో రేవతి, ఆమె కుమారుడు, మరో వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయారు. పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేసి.. ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే రేవతి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఆమె కుమారుణ్ని మరింత మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు. కాగా.. స్పృహతప్పిన బాలుడు శ్రీతేజ్‌కు పోలీసులు సీపీఆర్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది..