తన అరెస్టుపై స్పందిస్తూ.. హరీష్ రావు సంచలన ట్వీట్…ఇది ఇందిరమ్మ రాజ్యమా లేక ఎమర్జెన్సీ పాలనా అంటూ ట్వీట్…!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao)ను పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్(Arrest) చేశారు..కాగా తన అరెస్టుపై స్పందిస్తూ.. హరీష్ రావు సంచలన ట్వీట్(Tweet) చేశారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా లేక ఎమర్జెన్సీ పాలనా అంటూ ప్రశ్నిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారని, ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారన్నారు.

ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించినందుకు నాతో, నా బీఆర్ఎస్ నాయకులతో దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు రేవంత్ రెడ్డి.. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదని.. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుందని” హరీష్ రావు తన ట్వీట్ లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు..