ఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఇవాళ హరీశ్ రావు..కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు పోలీసులు ముందుగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దాంతో.. పోలీసులతో హరీశ్‌రావు వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆయన్ని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. కాసేపటికే కౌశిక్‌రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఆయన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసుల విధులను అడ్డుకున్నారనీ, సీఐని అడ్డగించి బెదిరించారని, కౌశిక్ రెడ్డిపై నిన్న బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత.. పోలీసులు.. మరికొందరు బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్టు చేశారు.
మరోవైపు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ నివాసానికి చేరుకున్న మేడ్చల్ బిఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు.. హరీశ్ రావు, కౌశిక్‌రెడ్డికి మద్దతుగా గోడదూకి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని, బిఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డిని కూడా అరెస్టు చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
హరీశ్ రావు ఏమన్నారు?
తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారన్న హరీశ్‌రావు.. ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కి వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. “ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన కంప్లైంట్ రాసేందుకు వెనకాడతారు, పైగా ఆయనపైనే కేసు రాస్తారు” అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
“ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం? రేవంత్ మీ పాలన మార్కు ఇదేనా? రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్‌గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటావు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న BRS నేతలపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటాం” అని హరీశ్‌రావు అన్నారు.
పోలీసుల అరెస్టును నిరసిస్తూ.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. హరీష్ రావును అక్రమంగా అరెస్టు చేసి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కి తరలిస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదవ్వడంతో, ఆయనతో మాట్లాడేందుకు హరీశ్‌రావు, ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు విడివిడిగా ఇద్దర్నీ అరెస్టు చేశారు.
హరీశ్‌రావు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్‌రావుపై ఆదివారం సిద్ధిపేటకు చెందిన ఓ రియల్టర్, కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్.. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. దాంతో అక్కడ కేసు నమోదైంది. ఈ క్రమంలో ఇప్పుడు హరీశ్‌రావు అరెస్ట్ అవ్వడం కలకలం రేపుతోంది.