అన్ని రంగాల్లో హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి అగ్రగామిగా నిలుస్తుంది… మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

సూర్యాపేట జిల్లా,..

హుజూర్ నగర్ పట్టణంలో,4 సూట్ల ఆర్ అండ్&బి అతిథి గృహం, మరియు ఆర్&అండ్ బి సబ్ డివిజన్ కార్యాలయ భవనముల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మాత్యులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్… వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లడుతూ*:-

పాత కొత్త బస్టాండ్ లను మెరుగు పరిచేందుకు మంత్రి ప్రభాకర్ ను ఆహ్వానిచాం…

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ను సాధించేందుకు ముందున్న, గొప్ప ఫైటర్ పొన్నం ప్రభాకర్.

నిస్సందేహంగా భారతదేశంలోనే కాంగ్రెస్ కు కంచుకోటగా హుజూర్ నగర్ నియోజకవర్గం..

హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా విద్య,వైద్యం,వ్యవసాయానికి,రహదారుల నిర్మాణాలకు,తాగు నీటికి ప్రగతి సాధించాం.

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 2000 వేల ఇండ్లను నిర్మాణానికి శంకుస్థాపన చెసుకుని పేదలకు ఇండ్లను ఇవ్వబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.

*మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లడుతూ..

ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా వున్న సందర్భంలో ఒకసారి ,మళ్ళీ ఇప్పుడు మంత్రిగా ఈరోజు హుజూర్ నగర్ కు రావడం జరిగింది.

ఉత్తమ్ అభ్యర్థన మేరకు
నాలుగు ఎకరాల స్థలంలో
5కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్ నిర్మించేందుకు మౌఖిక ఆదేశం చేస్తున్నాం. అదేవిధంగా పాత బస్టాండ్ ను కూడా మెరుగుపరచి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తాం.

రోజుకు అరవై లక్షల ప్రయాణికులు నేడు ఆర్టీసీ లో ప్రాయణం చేస్తున్నారు.

ప్రతి ఊరికి బస్సులు రావలనేదే మన ప్రభుత్వ లక్ష్యం.

నష్టాల్లో వున్న ఆర్టీసీ ఇప్పుడు అభివృద్ధి పదంలో నడుస్తుంది.

కృష్ణ తీరం మరియు,గోదావరి నది తీరంలో రైతులు బంగారాన్ని పండిస్తున్నారు.