సిరాజ్ స్టన్నింగ్ డెలివరీ ట్రావిస్ హెడ్ తో క్లీన్ బౌల్డ్…!

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా డే/నైట్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. అంపైర్ వివాదాస్పద నిర్ణయాలు, ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలతో వాతావరణం వేడిక్కిం ట్రావిస్ హెడ్‌ను మహ్మద్ సిరాజ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు హైలైట్ అనుకుంటే..అనంతరం హెడ్‌ను చూస్తూ సిరాజ్ కన్నెర్ర చేయడం సెన్షేనల్‌గా మారింది. మొత్తంగా 82వ ఓవర్‌లో జరిగిన సంఘటన అభిమానులకు కిక్కేచ్చింది.

వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం అందిస్తున్న ట్రావిస్ హెడ్‌ను సిరాజ్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. లోకల్ బాయ్ హెడ్‌ను అద్భుతమైన యార్క్‌ర్‌తో బోల్తాకొట్టించాడు. అయితే సిరాజ్ సంధించిన బంతికి సమాధానం చెప్పలేకపోయిన హెడ్.. అనంతరం మాటలతో బదులిచ్చాడు. మరోవైపు సిరాజ్ తగ్గేదేలా అంటూ ఇక వెళ్లిపో.. అంటూ సింబాలిక్‌గా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది.

141 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్ హెడ్ 140 పరుగులు చేశాడు. 17 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ (64; 126 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకం సాధించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (4/61), మహ్మద్ సిరాజ్ (4/98) చెరో నాలుగు వికెట్లతో సత్తాచాటారు. నితీశ్ రెడ్డి, అశ్విన్ తలో వికెట్ తీశారు. టీమిండియా కంటే ఆస్ట్రేలియా 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (42; 54 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (37; 64 బంతుల్లో, 6 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (31; 51 బంతుల్లో, 5 ఫోర్లు), రవిచంద్రన్ అశ్విన్ (22; 22 బంతుల్లో, 3 ఫోర్లు), రిషభ్ పంత్ (21; 35 బంతుల్లో, 2 ఫోర్లు) రాణించారు. మిగిలిన బ్యాటర్లూ ఎవరూ రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ (6/48) ఆరు వికెట్లతో విజృంభించాడు. ప్యాట్ కమిన్స్ (2/41), స్కాట్ బొలాండ్ (2/54) చెరో రెండు వికెట్లు తీశారు..