తేదీల్లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయని టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఈనెల 9వ తేదీ నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
ఉదయం, మధ్యాహ్నం మొత్తం రెండు సెషన్లలో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం సెషన్లో 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తరువాత ఎంట్రీ లేదు. మధ్యాహ్నం సెషన్కు 1.30 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండోది : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండో గ్రూప్-2 నోటిఫికేషన్. ఈ పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయిస్తారు. ప్రతి పేపరులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150 చొప్పున అడుగుతారు. మొత్తం 600ల మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులను గ్రూప్-2 అధికారులుగా ఎంపిక చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు..