*అల్లు అర్జున్ అరెస్టు చేయడం ప్రభుత్వం తప్పిదమే….. ఒంటెద్దు నరసింహారెడ్డి…*
*నల్ల బ్యాగు ని చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు గుర్తొస్తున్నారు ..*
*త్వరలో హుజూర్ నగర్ సెంటర్లో బతకమ్మ చేతబట్టిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు..*
*సూర్యాపేట జిల్లా….*
హుజూర్ నగర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్మీట్….. పాల్గొన్న మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమర్ గౌడ్,, అప్పిరెడ్డి, కడియం వెంకట్ రెడ్డి.. బాలాజీ నాయక్, నగేష్. రాంబాబు.. తదితరులు…
*ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ..*
సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు..
సీఎం రేవంత్ రెడ్డి, పేరు మార్చి బ్యాగుల,, తొండల రెడ్డి అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని అన్నారు…
అల్లు అర్జున్ అరెస్టు చేయడం ప్రభుత్వం తప్పిదమే…
ప్రభుత్వం తమ తప్పుల్ని కప్పి పూచుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ ని మొదలుపెట్టారని అన్నారు…
రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు..
అంతేకాదు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు కూడా గురవుతున్నారు…
కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా సిద్ధాంతం ఒకటే ప్రశ్నిస్తే కేసులు పెట్టాలి.. నిలదీసి అడిగితే అరెస్టు చెయ్యడం..
ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందన్నారు..
ఉచిత బస్సు, దానివల్ల జరిగే ఇబ్బందులు పూర్తిస్థాయిలో అందరం చూస్తున్నామని.. జీరో కరెంటు బిల్లు పేరుతో కొందరికి, జీరో మరికొందరికి డబల్ బిల్లు కడుతున్నట్లు తెలిపారు..
పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేకపోయారు…
వృద్ధులకి 4000 పెన్షన్ ఇవ్వలేకపోయారు..
మహిళలకి 2500 అందించలేకపోయారు..
విద్యార్థులకి ఏటీఎం కార్డుల ఇస్తానని అన్నారు అది ఇవ్వలేకపోయారు..
స్కూటీలు ఎటు పోయినాయి,, ఇలా ఎన్నో అబద్ధాలు చెప్పి సంబరాలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీస్తున్నారని అన్నారు..
ఉద్యమకారులకి స్థలాన్ని అందించి ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నారు అది ఎక్కడ..
అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు అందిస్తానన్నారు అది ఎప్పుడు..
సర్వేలు చేసి టైం పాస్ చేయడం మాత్రమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని ఆరోపించారు..
రైతు భరోసా ఎగ్గొట్టారు.. రైతుబంధుని మరిచిపోయారు..
గిట్టుబాటు ధర అంటూ మంత్రులు కొత్త పాట పాడారు..
చేతులెత్తి మొక్కాల్సిన ,, బతుకమ్మ మన సంస్కృతి కాదంటూ,, అది కేవలం అగ్రకులాలే ఆడతారు, బడుగు బలహీనులు ఆర్డర్ అంటూ, అహంకార ధోరణిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారు…
తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది… ఎక్కడ చూసినా కాంగ్రెస్ తల్లి విగ్రహం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆరోపించారు..