🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 15 – 12 – 2024,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,
తిథి : *పూర్ణిమ* మ2.37 వరకు,
నక్షత్రం : *మృగశిర* తె3.28 వరకు,
యోగం : *శుభం* తె3.43 వరకు,
కరణం : *బవ* మ2.37 వరకు
తదుపరి *బాలువ* రా1.56 వరకు,
వర్జ్యం : *ఉ9.43 – 11.16*,
దుర్ముహూర్తము : *సా3.56 – 4.40*,
అమృతకాలం : *సా6.59 – 8.31*,
రాహుకాలం : *మ12.00 – 1.30*,
యమగండం : *సా4.30 – 6.00*,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.26,
సూర్యాస్తమయం: 5.24,
*_నేటి విశేషం_*
*మార్గశీర్ష పూర్ణిమ. – శ్రీ దత్త జన్మ తిథి*
_శ్రీ దత్త జన్మ తిథి🙏☘️🌿_
ఒకానొకప్పుడు అత్రి, అనసూయ త్రిమూర్తులకు ఆనందం కలిగించి, వారిని తమ సంతానంగా జన్మించమని ప్రార్థించారు.
వారి ప్రార్థనను స్వీకరించి, త్రిమూర్తులు తమ అంశలతో వారికి పిల్లలుగా జన్మించారు.
బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్రాంశతో దూర్వాసుడు జన్మించారు.
విష్ణువు తక్కిన ఇద్దరి అంశలనూ తనలో ఇముడ్చుకొని త్రిమూర్త్యాత్మకుడై మార్గశీర్షమాసం పౌర్ణమి నాడు దత్తాత్రేయుడనే పేరుతో అవతరించాడు.
అవధూత సంప్రదాయం లోకంలో వ్యాప్తి చెందించిన పుణ్యకాలం మార్గశీర్షకాలం,
మార్గశిర పూర్ణిమని ( రాత్రికి పూర్ణిమ తిథి ఉండాలి )
దత్త జయంతిగా జరుపుకుంటాము.
*త్రిమూర్తి అవతారం దత్తాత్రేయ అవతారం*
అత్రి పుత్రుడు కనుక ఆత్రేయుడు అని అన్నారు, దత్తాత్రేయుడు గొప్ప యోగి, అవధూత, సాక్షాత్తూ విష్ణు అవతారం కనుక భగవంతుడు.
ఆత్మజ్ఞానాన్ని బోధించిన వాడు కనుక గురువు,
సాక్షాత్తూ ఆ ఆదిలక్ష్మి అనఘ , దత్తాత్రేయుడికి భార్యగా వచ్చింది.
ఈ పుణ్యదినమున ఆ దత్తాత్రేయుడిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. తెలుపు, పసుపు, ఎరుపు రంగు పూవులతో పూజించాలి. దధ్యోదనం (పెరుగన్నం), బెల్లంతో చేసిన గుడాన్నం నైవేద్యంగా సమర్పించాలి.
*”ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః” అనే మంత్రాన్ని జపించుకోవాలి*. అవకాశం ఉంటే ఆ రోజు రాత్రి 10గంటలకి వెన్నెలలో కూర్చుని ఈ మంత్రాన్ని జపించుకుంటే ఉత్తమం.
“దత్తాత్రేయుమ్ సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం
బాలార్క సదృశాభాసం శాంతమూర్తిమ్ నమామ్యహమ్” అనే శ్లోకాన్ని పఠించాలి.
దత్తాత్రేయుడు చాలా భక్త సులభుడు.
ఆయనని నమ్మి భక్తితో నమస్కరించినా కూడా ప్రసన్నుడు అవుతాడు, నిజమైన భక్తులను ఆయన పరీక్షిస్తాడు.
ఆ దత్తాత్రేయుడిని నమ్మి ఆ పరీక్ష తట్టుకుని నిలబడగలిగితే ఆయన ప్రసన్నుడు అయి ఎప్పటికీ రక్షిస్తుంటాడు.
దత్తాత్రేయుని 24 అవతారాలలో ముఖ్యమైనవి
శ్రీ పాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి అవతారములు.
పూర్వం పాండవ వంశంలో జన్మించిన శంఖణుడు అనే రాజు శత్రువుల చేతిలో చిత్తుగా ఓడిపోయి, ఒక గుఱ్ఱం ఎక్కి ఏకాకిగా అరణ్యాలలోనికి పారిపోయాడు.
అతని భాగ్యం వల్ల వేంకటాద్రి చేరాడు, అగస్త్య మహర్షి ఆ రాజుకు దర్శనం ఇచ్చి, అతని దుస్థితి తెలుసుకొని, అతని కోసం శ్రీమహాలక్ష్మిని ప్రార్థించగా, మార్గశీర్ష పౌర్ణమి నాడు తనను తామర పూలతో పూజించి, పాయసాన్నాన్ని నైవేద్యంగా పెడితే అతనికి పోయిన రాజ్యం తిరిగి లభిస్తుందని చెప్పింది.
అగస్త్యుడు లోపాముద్ర సహాయంతో, రాజుచేత అర్చన చేయించాడు.
శంఖణుడు తిరిగి తన సామ్రాజ్యాన్ని, అఖండ సంపదలనూ పొందాడు. మార్గశీర్షం యెుక్క మహామహిమ అటువంటిదని అగస్త్యుడు రాజుకు వివరించాడు.
*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏