🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌿పంచాంగం🌿
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 16 – 12 – 2024,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,
తిథి : *పాడ్యమి* మ1.15 వరకు,
నక్షత్రం : *ఆర్ద్ర* తె3.00 వరకు,
యోగం : *శుక్లం* రా1.36 వరకు,
కరణం : *కౌలువ* మ1.15 వరకు,
తదుపరి *తైతుల* రా12.48 వరకు,
వర్జ్యం : *ఉ11.42 – 1.16*,
దుర్ముహూర్తము : *మ12.16 – 1.00*,
మరల *మ2.28 – 3.12*,
అమృతకాలం : *సా5.12 – 6.46*
రాహుకాలం : *ఉ7.30 – 9.00*,
యమగండం : *ఉ10.30 – 12.00*,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 6.26,
సూర్యాస్తమయం: 5.24,
*_నేటి విశేషం_*
*ధనుర్మాస ప్రారంభం*
_ఉదయం 6.57..నిమిషాలకు ధనుర్మాసం ప్రారంభం అవుతుంది…!!_
ధనుర్మాసం సందర్భంగా – డిసెంబరు 17 నుండి జనవరి 13వతేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాతంస్థానంలో తిరుప్పావై🙏
ఇది శ్రీ మహావిష్ణువు మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు.
17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు.
కాగా, జనవరి 13న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి.
ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు.
కాగా ధనుర్మాస ఘడియలు 2025, జనవరి 13న ముగియనున్నాయి.
*🌹ధనుర్మాసానికివిశేషప్రాధాన్యం🌹*
పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు.
కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
*🌹దైవప్రార్థనకు అనుకూలం🌹*
తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటివాడినని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పినట్టు
పురాణాల ద్వారా తెలుస్తోంది, ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు.
ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు సాధారణంగా చేయరు.
పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే ఇందులో అంతరార్థం.
*🌹ధనుర్మాస పూజ వెయ్యేళ్ల ఫలం*
కలియుగంలో శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించినా వెయ్యేళ్ల పూజాఫలం దక్కుతుంది.
పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ధనుర్మాస పూజలు చేస్తారు.
*🌹ఆండాళ్తిరుప్పావైపారాయణం..*
12 మంది ఆళ్వార్లలో
శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరు, ఈమెను నాంచియార్ అని కూడా పిలుస్తారు.
ద్వాపర యుగ శ్రీ కృష్ణుడు అయిన తిరుమల శ్రీవారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు.
ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం, తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది.
శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు.
ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు.
ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
_ధనుర్మాస వ్రతం_
శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపారు.
ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖసంతోషాలు ఒనగూరుతాయని తెలియజేశారు.
సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేందుకు మధ్యగల కాలాన్ని ధనుర్మాసం అంటారు.
పాపకర్మలను నశింపచేసి మోక్షసాధనకోసం చేసే వ్రతాలు, పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు…🌹🙏
_🙏ఆండాళ్ తిరువడిగలే శరణం..🙏_
*_🌿శుభమస్తు🌿_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏