గెలిచినప్పుడు సంబరాలు చేసుకుని ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంల..కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా..

ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మెషిన్‌(ఈవీఎం)లపై నమ్మకం లేకపోతే పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయొద్దని జమ్మూ- కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు..గెలిచినప్పుడు సంబరాలు చేసుకుని ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలను నిందించడం సరికాదని తమ మిత్ర పక్షమైన కాంగ్రె్‌సపై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ మేరకు పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ”ఈవీఎంల ద్వారా వంద మందికి పైగా మీ పార్టీ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచినప్పడు సంబరాలు చేసుకుని, కొన్ని నెలల తర్వాత మరో ఎన్నికల్లో మీరు అశించిన స్థాయిలో సీట్లు రాకపోతే ఈవీఎంలను నిందించడం సరికాదు” అని అన్నారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో వ్యక్తిని ఎన్నుకుంటారని, అందుకు తానే ఉదాహరణనని, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తనను తిరస్కరించారని, కొన్ని నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపించారని చెప్పారు. తాను మెషిన్‌లను ఎప్పుడూ తప్పుపట్టలేదని తెలిపారు…