ఎమ్మెల్యే ఇల్లును టచ్ చేయకుండా సామాన్యులవి కూల్చివేత..!..హైడ్రా పక్షపాతం.!?.

కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇల్లు రోడ్డు మీదనే ఉంది కానీ వాళ్ళ ఇల్లు ఎవరు టచ్ చేయలేదని స్థానికులు ఆగ్రహించారు. రూల్స్ ప్రకారం కూల్చితే ఎమ్మెల్యే ఇల్లు కూడా కూల్చాలి కదా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనేవాడు ముందు ఉండి తనది కూల్చేసి అందరిది కూల్చాలి అంటే అందరం ముందుకు వస్తామన్నారు. కూల్చేస్తున్నారు అని ఎమ్మెల్యేకు చెప్పుకుంటే వచ్చి కూల్చొద్దు అని చెప్పి ఆటే వెళ్లిపోయాడు.. ఆయన వెళ్ళగానే వీళ్లు మళ్లీ వచ్చి కూల్చేశారని ఫైర్ అయ్యారు..

హైడ్రా పక్షపాతం..!?

లార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మిగూడలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఫుట్ పాత్ పై ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో లక్ష్మీగూడా నుంచి వాంబే కాలనీ వరకు కొనసాగుతున్నాయి కూల్చివేతలు…
దీంతో భారీగా మోహరించారు పోలీసులు. ఈ సందర్భంగా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు… ఎమ్మెల్యే ఇల్లు కూడా రోడ్డుపైనే ఉంది కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే కాకపోవడంతో ఆయన ఇంటి జోలి ఎవరు వెళ్లడం లేదని అన్నారు.. పేదల ఇల్లు కూల్చడానికి అందరూ రెడీ గానే ఉంటారని ఆగ్రహించారు… ప్రస్తుతం అదే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Demolitions at Lakshmiguda in Mylardevpally.