🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 19 – 12 – 2024,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,
తిథి : *చవితి* మ12 08 వరకు,
నక్షత్రం : *ఆశ్లేష* తె4.25 వరకు,
యోగం : *వైధృతి* రా9.24 వరకు,
కరణం : *బాలువ* మ12.08 వరకు
తదుపరి *కౌలువ* రా12.46 వరకు,
వర్జ్యం : *సా4.46 – 6.26*,
దుర్ముహూర్తము : *ఉ10.07 – 10.51*,
మరల *మ2.30 – 3.14*,
అమృతకాలం : *రా2.45 – 4.25*,
రాహుకాలం : *మ1.30 – 3.00*,
యమగండం : *ఉ6.00 – 7.30*,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 6.28,
సూర్యాస్తమయం: 5.26,
*_నేటి పాశురం_*
_*తిరుప్పావై – 4వ పాశురము*_
_*ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్*_
_*ఆళియుళ్ పుక్కు ముగన్దు కొడార్ త్తేరి*_
_*ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు*_
_*పాళియందోళుడై ప్పర్పనాబన్ కైయిల్*_
_*ఆళిపోళ్ మిన్ని వలమ్బురి పోల్ నిన్రదిర్న్దు*_
_*తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్*_
_*వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్*_
_*మార్గళి నీరాడ మగిళ్ న్దేలో రెమ్బావాయ్*_
_*తాత్పర్యము:-*_
గంభీరస్వభావుడా! వర్షనిర్వాహకుడా! ఓ పర్జన్యదేవా! నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏ మాత్రమును సంకోచింపజేయకుము.
గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి, ఆ సముద్రజలమునంతను, నీవు పూర్తిగా త్రాగి, గర్జించి, ఆకాశమున వ్యాపించి, సర్వజగత్కారణభూతుడగు శ్రీ నారాయణుని దివ్యవిగ్రహము వలె శ్యామలమూర్తివై, ఆ పద్మనాభుని విశాలసుందరబాహుయుగళిలో దక్షిణబాహువునందలి చక్రము వలెమెరిసి, ఎడమచేతిలోని శంఖము వలె ఉరిమి, శార్ఙ్గమను ధనస్సునుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు, మేము సంతోషముతో మార్గశీర్షస్నానము చేయునట్లు వర్షించుము.
*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏