ముసలి హీరోల పక్కన యాక్ట్ చెయ్యను అని కావ్య..!!

ట్రెండ్‌ను ఫాలో అవుతుంది బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్.బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే..స్నేహం అంటే ఇదేరా అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. గంగోత్రి, బాలు, ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది..m ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉన్నత చదువుల కోసం కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ గతేడాది హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది..సస్పెన్స్, థ్రిల్లర్ ‘మసూద’ సినిమాలో లీడ్ రోల్‌లో నటించి మెప్పించింది. హార‌ర్ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమా కావ్య కళ్యాణ్ రామ్‌కు తొలి హిట్ అందించింది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘బలగం’ సినిమాతో మరో సూపర్ హిట్‌ను కావ్య కళ్యాణ్ తన ఖాతాలో వేసుకుంది. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న కావ్య కళ్యాణ్, ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించింది…

దీనిపై ఓ ఇంటర్య్వూలో స్పందిస్తూ..ముసలి హీరోల పక్కన యాక్ట్ చెయ్యను అని కావ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా దీనిపై స్పందిస్తూ..ముసలి హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని, కానీ వారితో సినిమాలు చేయనని చెప్పేశానని చెప్పి సంచలనం సృష్టించింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చింది ఈ బ్యూటీ. అల్లు అర్జున్, బాలయ్య సినిమాలలో బాలనటిగా నటిస్తున్నప్పుడు, పెద్దయ్యాక తమ పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేయమని సరదాగా అడిగేవారని చెప్పింది. అయితే చిన్నతనంలో ఏదో తెలియక ముసలి వాళ్ళతో యాక్ట్ చేయనని అన్నానని చెప్పింది.