వరుసగా మూడో రోజూ భూప్రకంపనలు…!?

ఆంధ్రప్రదేశ్లో మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో గత మూడ్రోజులుగా వరుసగా స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. సింగనపాలెం, ముండ్లమూరు, మారెళ్ల, శంకరాపురం పరిసర ప్రాంతాల్లో ఇవాళ భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత రెండ్రోజులుగా ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లోని గ్రామాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి…

జిల్లాలోని ముండ్లమూరు మండలంలో భూమి సెకను పాటు కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ల ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్పంగా భామి కంపించింది….. శ‌ని, ఆది వారాల్లో కూడా ఇలాగే భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో జిల్లా ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లకు గుర‌వుతున్నారు. ఈరోజు భూమి కంపించిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు భ‌యంతో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అస‌లేం జ‌రుగుతోందో అర్థం కావ‌ట్లేద‌ని స్థానికులు వాపోతున్నారు…