కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న దూరం…!

కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు అంటూ సొంత పార్టీ నేతలే . తీన్మార్ మల్లన్న పై గురుగా ఉన్నట్లు అనిపిస్తుంది.!!. అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ స్ట్రాటజీ అంతా తనదే అన్నట్లుగా ఆయన చేస్తున్న హడావుడితో నేషనల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీ సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం అనేలా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలే పార్టీ పరువు పోతోంది… అని భావిస్తున్నారట..

ఆయనను ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న కి చాలా దూరం పెరిగినట్లుగా సమాచారం.. నేరుగానే సీఎం కులాన్ని అడ్డగోలుగా తిట్టడం కూడా ఓ కారణము అంటున్నారు… అంతేకాకుండా పార్టీపై కూడా చాలాసార్లు ప్రత్యక్షంగానే విమర్శలు గుప్పిస్తున్నారు… ప్రస్తుతం ఆయనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు. ఆయన కూడా తాను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడం లేదు. సొంతగా బీసీ నినాదంతో ర్యాలీలు,సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నేతల్ని తిడుతున్నారు.

అయితే అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి ఆయన తన మార్క్ రాజకీయంతో కాంగ్రెస్ ను వాడేసుకుంటున్నారు. ఓ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు తెలంగాణలో ఉండే వారికి పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ జాతీయ మీడియాకు అసలు తెలియదు. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్సీ .. అల్లు అర్జున్ పై ఫిర్యాదు అని ప్రచారం చేసేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వ స్ట్రాటజీ అన్నట్లుగా వారు మార్చేసి …చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నారు.

ఇక్కడ మల్లన్న తన సొంతం చానల్,, మిగతా చానల్లో మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇతనికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటు ఎలా ఇచ్చిందని అందరూ అనుకుంటారు. ఘోరంగా మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మల్లన్న ఇలా ఎందుకు చేస్తున్నారో ఆయన గురించి అవగాహన ఉన్న కొంత మందికి తెలుసు. కానీ ఇక్కడ ఆయన కాంగ్రెస్ కు డ్యామేజ్ చేస్తూండటమే అసలు విషయం. కానీ ఆయనను కాంగ్రెస్ నేతలు కంట్రోల్ చేయలేకపోతున్నారు… సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో ఎవరూ మాట్లాడొద్దు అని తెలిపిన వద్దనుంటే ఇంకా అల్లు అర్జున్ పై ఎక్కువగా మాట్లాడుతున్నట్లుగా సమాచారం… ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..