*🔹డిప్యూటీ సీఎం పవన్‌తో సమావేశమైన దిల్‌రాజు*
గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు..
పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించిన దిల్‌రాజు..
సినిమా టికెట్ రేట్ల అంశంతో పాటు..
సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ..
విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అమరావతిలో దిల్‌రాజు సమావేశం అయ్యారు. గేమ్‌ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రావాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్‌ను దిల్‌రాజ్ ఆహ్వానించారు. సినిమా టికెట్ రేట్ల పెంపుతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్‌ను కొత్త సంవత్సరం సందర్భంగా 2025 జనవరి 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు దిల్‌రాజు ఇప్పటికే ప్రకటించారు. కటౌట్ లాంచ్ ఈవెంట్లో ఫ్యాన్స్ ట్రైలర్.. ట్రైలర్ అంటూ అప్డేట్ కోసం అరిచారు. దీంతో దిల్‌రాజు స్పందించారు. కొత్త సంవత్సరం జనవరి 1న ట్రైలర్ తెస్తామని అన్నారు. ఇప్పటికే ట్రైలర్ తన ఫోన్లోనే ఉందని.. అది మీ దాక వచ్చేవరకు చాలా పనులు చేయాల్సి ఉందన్నారు. జనవరి 1న ట్రైలర్ చూస్తారన్నారు. దీంతో రాంచరణ్, మెగా ఫ్యాన్స్ అంతా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
సంధ్య థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు.. అభిమాని మృతిచెందిన తర్వాత.. వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టైంది.. అంటూ సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లుఅర్జునే కాదు..టీమ్ అయినా సంతాపం తెలపాల్సింది.. సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదని.. అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారనడం సరికాదంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు..