ఈరోజు తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే. రూ.10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష…!

కొత్త ఏడాదికి సంతోషంగా, ఆనందంగా స్వాగతం పలకాలని జీహెచ్‌ఎంసీ పోలీసులు సూచనలు చేస్తున్నారు. వేడుకలు విషాదానికి దారితీయొద్దని పేర్కొంటున్నారు. 2025 అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే న్యూ ఇయర్‌ వేడుకల సంరద్భంగా ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంటున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో విధించిన ఆంక్షల వివరాలను సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగించకుండా నిఘా పెట్టామన్నారు. ఫామ్‌హౌస్‌లు, రెస్టారెంట్లు, పబ్‌లపై దాడులు చేస్తామని తెలిపారు. ఏదైనా కేసులో ఇరుక్కుంటే జీవితం నాశనమని తెలిపారు. డ్రగ్స్‌ వినియోగం చేయకుండా చూడాలని సూచించారు. ఈ బాధ్యత ఈవెంట్ల నిర్వాహకులు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులదే అని స్పష్టం చేశారు. ఇక మద్యం సేవించి ఎవరూ రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి విస్తృతంగా డ్రంకన్‌డ్రైవ్‌ను నిర్వహిస్తామని తెలిపారు..

ఈరోజు తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే. రూ.10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష.*

_• తెలంగాణ పోలీసులు ఈరోజు రాత్రి 8 గంటల నుండి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ & డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించనున్నారు._

_• మొదటిసారి మద్యం తాగి పట్టుబడితే రూ. 10 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష._

_• రెండోసారి పట్టుబడితే ₹ 15 వేల జరిమానా, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు సస్పెండ్._

_• డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు..