తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడంపై ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు కీలక నిర్ణయం…!
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
సోమవారం ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో చర్చించారు. వారానికి 4 సిఫార్సు లేఖలను అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లుగా బీఆర్ నాయుడు తెలిపారు. వారానికి 2 బ్రేక్ దర్శనాలు, రెండు 300 రూపాయల దర్శనానికి సంబంధించిన లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇచ్చారని బీఆర్ నాయుడు వెల్లడించారు..