అల్లు అర్జున్‌కు నాంప‌ల్లి కోర్టు రెగ్యుల‌ర్ బెయిల్‌ను మంజూరు..!

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో అగ్ర న‌టుడు అల్లు అర్జున్‌కి భారీ ఊరట ల‌భించింది. అల్లు అర్జున్‌కు నాంప‌ల్లి కోర్టు రెగ్యుల‌ర్ బెయిల్‌ను మంజూరు చేసింది. పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందిన విష‌యం తెలిసిందే…రేవ‌తి మ‌రణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ ఆయ‌న‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో ఆయన విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్‌ ముగియడంతో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం అల్లు అర్జున్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై నేడు విచార‌ణ చేప‌ట్టిన‌ నాంప‌ల్లి కోర్టు అల్లు అర్జున్‌కి రెగ్యుల‌ర్ బెయిల్‌ను మంజూరు చేసింది…పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద ఈ తొక్కిసలాట జరిగింది అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడంతో ఆయనని చూడడం కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ సమయంలోనే తొక్కిసలాట జరిగి అభిమాని మరణించడంతో ఈయన పై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ ఏకంగా A11 ముద్దాయిగా ఉన్నప్పటికీ తనని అరెస్టు చేయడంతో ఈ అరెస్టు వెనుక ఏదో కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ అరెస్టు కాస్త ఇటు సినీ ఇండస్ట్రీలోనూ అటు తెలంగాణ రాజకీయాలలో కూడా చర్చలకు కారణమైంది..