గుజరాత్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు
గుజరాత్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు
గుజరాత్లో భూకంపం సంభవించింది. కచ్‌లో శనివారం సాయంత్రం 4.37 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైంది. కచ్‌లోని దుధై సమీపంలోని నవ్లాఖా రాన్లో భూమికి 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మిక్ రీసెర్చ్ వెల్లడించింది. అయితే భూకంపం సంభవించిన సమయంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు..
పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్ .
AP: కాకినాడ జిల్లా వాకపూడి వద్ద సముద్రంలో అక్రమంగా తాబేళ్ల వేట యథేచ్చగా కొనసాగుతోంది. దీంతో తాబేళ్ల సంరక్షణపై డిప్యూటీ CM పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో సముద్రంలో 5నెలల పాటు చేపలవేటపై నిషేధం విధించారు. తీరప్రాంతం 5 కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ నిర్వహించారు. చేపల వేటకు వెళ్తున్న రెండు బోట్లను సీజ్ చేశారు..
14 ఏళ్ల బాలుడిని కత్తితో పొడిచి చంపిన క్లాస్మేట్
ఢిల్లీలోని ఓ స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్ జరుగుతున్న సమయంలో జరిగిన గొడవతో 14 ఏళ్ల బాలుడిని సహచర విద్యార్థి కత్తితో పొడిచి చంపాడు. క్లాస్ ముగిసిన తర్వాత నిందితుడు ముగ్గురు- నలుగురు వ్యక్తులతో కలిసి స్కూల్ బయట గేట్ వద్ద 7వ తరగతి చదువుతున్న ఆ బాలుడిపై దాడి చేశారు. పాఠశాల సిబ్బంది వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆ విద్యార్థి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..
బీహార్‌లో ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్ష..
ఆయన లగ్జరీ వ్యాన్‌పై సర్వత్రా విమర్శలు.. ఎందుకంటే?
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) డిసెంబర్ 13న నిర్వహించిన కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పదిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన కొనసాగుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికీ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు సుపరిచితమే. గత కొన్నేళ్ల క్రితం బిహార్ లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. సొంతంగా జన్ సురాజ్ పార్టీని కూడా స్థాపించారు. పాదయాత్రసైతం చేశారు. గతేడాది నవంబర్ లో బీహార్ రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి జన్ సురాజ్ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేయగా అన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయారు. ఈ ఏడాది బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు జన్ సురాజ్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాదరణ పొందాలని ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు మద్దతుగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) డిసెంబర్ 13న నిర్వహించిన కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పదిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన కొనసాగుతున్నారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం వేలాది మంది అభ్యర్థులు పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద నిరసనకు దిగారు. జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ విద్యార్థులకు పూర్తి మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీగా బయల్దేరేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా.. పట్నాలోని గాంధీమైదాన్ లో మహాత్ముడి విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, ఈ సమయంలో అక్కడ ఓ లగ్జరీ వ్యాన్ ఉంది. ఆ వ్యాన్ ప్రశాంత్ కిషోర్ ది కావడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న వేదిక పక్కనే లగ్జరీ వాహనం ఉంది. అందులో ఏసీ, కిచెన్, బెడ్రూం వంటి సకల సదుపాయాలు ఉన్నాయి. అందులో వాష్ రూమ్ కూడా ఉంది. ఈ వాహనం ఖరీదు కోట్ల రూపాయలు ఉంటుంది. దీంతో ప్రశాంత్ కిశోర్ పై రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. లగ్జరీ వాహనం పక్కన పెట్టుకొని పీకే దీక్ష చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విద్యార్థి ఉద్యమంలో పాల్గొంటున్న ప్రశాంత్ కిశోర్.. విద్యార్థులకు మేలుచేయడం అటుంచితే రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నాడని బీజేపీ నేత నీరజ్ కుమార్ విమర్శించారు. బీపీఎస్సీ విద్యార్థులు ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. మరోవైపు నెట్టిట్లోనూ ప్రశాంత్ కిశోర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..ప్రశాంత్ కిశోర్ పై వస్తున్న విమర్శలను జన్ సురాజ్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. ఆ వ్యాన్ అక్కడ ఉండటం అసలు సమస్య కానేకాదు. ఇక్కడ పట్టించుకోవాల్సిన అంశం విద్యార్థుల భవిష్యత్తు. ప్రశాంత్ కిశోర్ ను, విద్యార్థులకోసం ఆయన చేస్తున్న ఉద్యమాన్ని కించపర్చేందుకు మధ్యలో వ్యాన్ ను అధికారపార్టీ నేతలు అస్త్రంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాజా పరిణామాలపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు నా నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు…
ఏపీలో గేమ్ ఛేంజర్ సినిమాకి స్పెషల్ షోస్, టికెట్ రేట్స్ హైక్
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలు
జనవరి 10 నుంచి జనవరి 23 వరకు 5 షోస్ కు టెక్కెట్ రేట్లు పెంపు కు అనుమతి
మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 175 రూపాయలు
సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 135 రూపాయలు పెంపు ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.
చైనాలో HMPV వైరస్.. తెలంగాణలో ముందుజాగ్రత్త చర్యలు
చైనాలో HMPV వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా.. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ
రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించాలని, సబ్బు లేదా శానిటైజర్‌తో మీ చేతులను తరచుగా కడగాలని
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు దగ్గరకి వెళ్లకూడదని అంటూ కొన్ని మార్గదర్శకాలను సూచించిన తెలంగాణ ఆరోగ్య శాఖ…
మళ్లీ మన టైం వస్తది.. అన్నీ రాసుకుంటున్నా.. వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం.. కేటిఆర్
గ్రామాల్లో కార్యకర్తలను వేధిస్తున్న వాళ్ల పేర్లు రాసుకోండి.. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం అన్నారు…
ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతోంది.. కాబట్టి ప్రేక్షకపాత్రకు పరిమితం కావదవ్దని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. కేసులకైనా భయపడకండి అని.. చిట్టినాయుడు ఏం పీకలేడని ఎద్దేవా చేశారు. చిల్లర మల్లర రాతలు రాయించేవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. బాక్సింగ్‌లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు అని చెప్పారు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలు అయ్యారని కానీ కేంద్రం నుంచి వచ్చింది మాత్రం గుండు సున్నా అని విమర్శించారు.
చిన్న చిన్న తప్పిదాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఒక రోజు దేశంలో చక్రం తిప్పే రోజు ముందుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రూ.369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పజెప్పితే.. మనం దిగిపోయేనాడు రూ. 5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్‌కు అప్పజెప్పామని తెలిపారు. రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిదో మాట.. ఉప ముఖ్యమంత్రిదో మాట ఉందని విమర్శించారు.
పదేళ్లలో రూ. 4 లక్షల 17 వేల కోట్లు మనం అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో రూ. 1 లక్షా 37 వేల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మేం చెప్తాం.. మీ అప్పులతో ఏం జరిగిందో మీరు చెప్పగలరా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేసిందని ప్రశ్నించారు. పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నారని అన్నారు. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎం అయిపోయిందని విమర్శించారు. కోటి ఆరు లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని ఏం చేసినట్టు? మళ్ళీ ఈ రైతు ప్రమాణ పత్రాలెందుకు అని ప్రశ్నించారు.
ఆరు గ్యారంటీల గురించి ప్రశ్నిస్తుంటే.. తననను ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేటీఆర్ విమర్శించారు. కొడంగల్ భూములివ్వని కేసులో కూడా తనను ఇరికించే యత్నం చేశారని తెలిపారు. ఆయన కేసుల గురించి ఆలోచిస్తుంటే.. మనం రైతుల గురించి ఆలోచిద్దామని తెలిపారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించి, బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు వేసుకుందామని తెలిపారు. రైతు భరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలని సూచించారు…
*అతను మరణించాడు … మరో ముగ్గురి ప్రాణాలను కాపాడాడు.*
నిత్యం వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటి పెద్ద మరణించి పుట్టెడు దుఖంలో ఉన్నప్పటికీ వారి కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయం ఎందరికో స్ఫూర్తిధాయకమైంది.
కర్నూలు జిల్లా పెద్దయ్య (59) వ్యవసాయదారుడు. ఈ నెల 2వ తేదీన ఇంట్లో బ్రెష్ చేసుకుంటున్న సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది.
మొదడులో ఏదో పగిలినట్టు శబ్దం వచ్చినట్లు చెప్పడంతో వెంటనే కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.
రోగిని పరీశీలించిన వైద్యులు తలలో బ్లడ్ క్లాట్ అయ్యిందని గుర్తించారు.
దురదృష్టవాశాస్తూ శనివారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయ్యారు.
అనంతరం భార్య, కుమారులు మరియు కుటుంబ సభ్యుల అంగీకారంతో లివర్, రెండు కిడ్నీలు దానం చేశారు. చనిపోతూ కూడా మరో ముగ్గురికి ప్రాణదానం చేయడం మాకు గర్వంగా ఉందని మృతుడి భార్య, కుమారులు పేర్కొన్నారు…
అమ్మకానికి రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు….!
తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ సర్కారు ప్రజాపాలన దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తొంది. ఒకవైపు ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకై చర్యలు తీసుకుంటున్నారు…మరొవైపు గత ప్రభుత్వం వైఫల్యాలను కూడా ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. అయితే.. ప్రస్తుతం తెలంగాణ గత సర్కారు అక్రమాల వల్ల అప్పుల ఊబీలో కూరుకుపోయిందని రేవంత్ పలు మార్లు విమర్శలకు దిగారు.
ఈ క్రమంలో గత ప్రభుత్వం చేసిన అప్పులకే.. తాము ఇంకా మిత్తిలు కడుతున్నామని కూడా అసెంబ్లీ వేదికగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని.. రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి రంగం సిద్దం చేసినట్లు తెలుస్తొంది. అయితే.. ఇప్పటికే బండ్లగూడలోని దాదాపు.. 159, పోచారంలోని 601 ఫ్లాట్ లు అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తొంది.
అదే విధంగా.. పోచారం, గాజుల రామారం, జవహర్ నగర్ లో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్ మెంట్ లు సైతం..వేలం వేయనున్నట్లు సమాచారం. అయితే.. వీటి అమ్మకానికి సంబంధించి మరిన్ని వివరాలకు ఆయా స్థానిక అధికారులను సంప్రదించాలని కూడా అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకాలతో.. ప్రభుత్వం.. రూ. 2500 కోట్ల వరకు ఆదాయం అర్జించాలని కూడా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
మొత్తంగా తెలంగాణ సర్కారు మాత్రం.. రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను రెండు దశలో అమ్ముతున్నట్లు తెలుస్తొంది. నిర్మాణదశలో ఉన్నఫ్లాట్ల అమ్మకాలను.. బిల్డర్ లకు లేదా రియల్టర్లకు అమ్మేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తొంది. అయితే.. ఈ ఫ్టాట్లను కొనేందుకు ఆసక్తిగా ఉన్నవాళ్లంతా స్థానిక అధికారుల్ని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకొవాలని ఉన్నతాధికారులు ఒక ప్రకటలో కొరినట్లు తెలుస్తొంది..