బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిపైన టీపీసీసీ (TPCC) సీరియస్గా స్పందించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేపట్టడం అవసరం అయినా, రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడికి వెళ్లడం సరైంది కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు…ప్రియాంక గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, యూత్ కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదని ఆయన అన్నారు.
యూత్ నేతలను పిలిచి వారిని మందలించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. బీజేపీ నేతలు కూడా ఇలాంటి దాడులు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య సంస్కృతి కాపాడాలని, శాంతి భద్రతల విషయంలో బీజేపీ నేతలు సహకరించాల్సిన అవసరం ఉందని కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజాస్వామ్యం లో దాడులు పద్ధతి కాదన్నా మహేష్ కుమార్ గౌడ్. ..
ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్ల దాడులు చేసుకునే వరకు వెళ్లాయి. ఈ మొత్తం పరిస్థితుల్ని పరిశీలిస్తున్న ఇరు పార్టీల సీనియర్ నేతలు.. పార్టీ యువత తీరును ఖండిస్తున్నాయి. తాజాగా.. బీజేపీ కార్యాలయం పైకి నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు వెళ్లడంపై.. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఓ పార్టీ కార్యాలయంపై మరో పార్టీ కార్యకర్తలు దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు.
ఏ విషయమైన నిరసన చేపట్టినా, అవి ఎంత తీవ్రమైనవి అయినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసనలు ఉండాలని టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తమ పార్టీ కి చెందిన యూత్ కాంగ్రెస్ నేతలు మరో పార్టీ కార్యాలయంపైకి వెళ్లడాన్ని తప్పుబట్టిన మహేష్ కుమార్.. యూత్ నాయకుల్ని పిలిపించి మందలించనున్నారు. ఇప్పటికే.. ఫోన్ లో యూత్ కార్యకర్తలు, నాయకులకు క్లాస్ పీకినట్లు సమాచారం…