జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను ఏ పార్టీ అని నిలదీసిన కౌశిక్‌రెడ్డి..
సమీక్ష సమావేశం నుంచి కౌశిక్‌రెడ్డిని బయటకు పంపిన పోలీసులు..
మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్‌బాబు ఉండగానే రసాభాస..
కరీంనగర కలెక్టరేట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరగటంతో తోపులాటకు దారితీసింది..దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
సంజయ్ మాట్లాడుతుండగా..
ఈ మేరకు సమావేశంలో సంజయ్ మాట్లాడుతుండగా సంజయ్‌ది ఏ పార్టీ అంటూ కౌశిక్ నిలదీయడంతో గొడవ మొదలైంది. దీంతో ఒకరిపైకి ఒకరు దూసుకురాగా అక్కడుతన్న వారంతా అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆగకుండా కౌశిక్ రెడ్డి ముందుకు దూసుకెళ్లడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పరస్పరం చేయి చేసుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డిని బలవంతంగా పోలీసులు బయటకు తీసుకెళ్లారు. అయితే ఈ సమావేశఃలో మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు ఉండటం గమనర్హం. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కేసీఆర్ పెట్టిన భిక్ష..
ఇక ‘కేసీఆర్ పెట్టిన భిక్షతోని గెలిచి సిగ్గులేకుండా పార్టీ మారిండని సంజయ్ పై కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. అన్నం తింటుండా లేక పెండ తింటుడా? దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవమని చెప్పుమనండి. అంతపెద్ద మోగోడైతే రాజీనామా చేయాల్సిందే. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను ఎక్కడికెళ్లిన అడ్డుకుంటాం. వారిని తిరగనివ్వం’ అంటూ కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు..
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…!
నిధులు అడిగితే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో 50 శాతమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. మిగతా 50 శాతం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశానని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చామని గుర్తుచేశారు. రెండో విడత దళితబంధు ఇవ్వాలని కోరామని చెప్పారు..బీఆర్ఎస్ బీఫామ్‌తో గెలిచి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటూ చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ తరఫున మాట్లాడితే మేం చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టా అని నిలదీశారు. వందల మంది పోలీసులతో నన్ను లాక్కొచ్చారని చెప్పారు. కచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టంచేశారు. మూడేళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు అధికారులతో పాటు ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. పోలీసులకు కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు..