సంక్రాంతి పండుగ తర్వాత రైతులందరికీ రైతు భరోసా కింద ఒక ఎకరానికి రూ.12 వేలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

సూర్యాపేట జిల్లా … హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మండలంలో ఆదివారం పర్యటించారు… ఉదయం హైదరాబాద్ లోని బేగంపేట నుండి హెలికాప్టర్ లో బయలుదేరి నేరేడుచర్ల చేరుకున్నురు ..అక్కడ నేరేడుచర్ల పట్టణం &మండలంలో రూ 18.57 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు… అనంతరం నేరేడుచర్ల మండలంలోని కల్లూరులో అభివృద్ధి పనులతో పాటు శంకుస్థాపన చేసి..ఆ గ్రామంలో నిర్వహించే రాష్ట్రస్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలను ప్రారంభించారు…

*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..*

సంక్రాంతి పండుగ తర్వాత రైతులందరికీ రైతు భరోసా కింద ఒక ఎకరానికి రూ.12 వేలు అమలు చేస్తామని కానీ గత ప్రభుత్వం రైతులకు పదివేల అందించిందని గుర్తు చేస్తూ.. తాము వ్యవసాయానికి యోగ్యానికి అనుకూలమైన భూములకు పంటలు వేసిన చేయకున్న 12 వేల రూపాయలను సంక్రాంతి తర్వాత అమలు చేస్తామని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల పట్టణం మండలం లో ఆయన పర్యటించి 18.57 కోట్ల రూపాయల పనులకు ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ కలిసి శంకుస్థాపన చేసి ప్రారంభించారు.స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు కూలీలకి 12000 అందజేస్తామని, అర్హులైన అందరికీ నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని అన్నారు.

వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చి ఒక్కొక్కరికి 6 కేజీల సన్న బియ్యం అందిస్తామన్నారు. రైతుల పట్ల రైతు కూలీల పట్ల యువత పట్ల మహిళల పట్ల సమాజం ఇంత శ్రద్ధ వహించే ప్రభుత్వ వింత వరకు చూడలేదన్నారు . అందరి సంపూర్ణ మద్దతు ప్రభుత్వానికి ఉండాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాల కాంగ్రెస్ కు కంచుకోట అని జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% ఫలితాలు రావాలన్నారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయం సమానంగా తీసుకుని వెళుతుందన్నారు. బీసీ,ఎస్సీ వర్గీకరణ చేసి అందరికీ సమానంగా న్యాయం జరిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ ఏర్పడిన వెంటనే 55 వేల ఇచ్చామని మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని ప్రతి ఒక్కరికి మెడికల్ ఇన్సూరెన్స్ 10 లక్షల వరకు చేస్తున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంత అభివృద్ధి సంక్షేమం చేయలేదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేబినెట్ మంత్రులు అంతా కలిసి 24 గంటలు 365 రోజులు ప్రజల మేలు కోసం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు.ఇలా ఒక్క సంవత్సరం కాలంలో ఇంత అభివృద్ధి, సంక్షేమం చేపట్టడం నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చూడలేదని మంత్రి తెలిపారు. కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాల ప్రజలు చూపెడుతున్న అభిమానాన్ని, ఆప్యాయతలను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రుణం కోసం తీర్చుకుంటానన్ని మీకు ఏ సమస్య ఉన్న మీ ఉత్తమన్నకి చెప్పాలని తెలిపారు. అనంతరం కల్లూరు గ్రామంలో సీనియర్ జర్నలిస్ట్ టిడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర నాయకులు చలసాని శ్రీనివాసరావు ఆయన కుమారుడు రాజీవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ప్రారంభించి వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత చదువు తో పాటు ఆటలపై శ్రద్ధ పెట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఇంచార్జ్ ఆర్ డి ఓ సూర్యనారాయణ,మున్సిపల్ చైర్మన్ బచ్చలికూర ప్రకాష్ , వైస్ చైర్మన్ సరిత,ఆర్ & బీ ఈ ఈ సీతారామయ్య, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి,తహసీల్దార్ సైదులు, వ్యవసాయ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి నూకల సందీప్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి నాయకులు గోపాల్ మోతిలాల్ సుబ్బారావు పాల్గొన్నారు.