*ఏపీలోని ఆసుపత్రుల్లో 26,263 ఉద్యోగాలు ఖాళీ!*
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల పరిధిలో వైద్యులు, పారామెడికల్ ఉద్యోగాల ఖాళీలు 25.97 శాతం ఉన్నాయి. నిర్ణీత 1,01,125 ఉద్యోగాలలో 3,114 వైద్యులు, 23,149 పారామెడికల్ ఉద్యోగులు లేరు. వీటిలోని ఖాళీలను అవసరాల మేరకే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాధాన్య క్రమంలో తొలుత ఏడెనిమిది వేల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోనుంది……
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి ఈనెల 20 వరకు గ్రామాల్లో సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం..
– క్షేత్రస్థాయిలో రైతుల భూముల సర్వేకు వ్యవసాయ శాఖ సన్నద్ధం..
– ఈనెల 21, 22 తేదీల్లో సాగుకు ఆమోదయోగ్యం కానీ భూముల వివరాలు వెల్లడి..
– ఈ నెల 23న సాగుకు ఆమోదయోగ్యమైన భూముల వివరాలు వెల్లడి, రైతుభరోసాకు అర్హులైన రైతుల జాబితా ప్రకటన..
– ఈ నెల 26 నుండి రైతుల ఖాతాల్లో రైతుభరోసా విధులు జమా..
విజయవాడలో పోలీసులపై దాడి అవాస్తవం: సీఐ
విజయవాడ శివారు జక్కంపూడిలో జూద శిబిరాలు ఖాళీ చేయించామని కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. బుధవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. జక్కంపూడిలో పోలీసులపై ఎటువంటి దాడి జరగలేదని ఎస్ఐ సివిల్ డ్రెస్‌లో ఉండటం వల్ల అక్కడ ఉన్న ఆకతాయిలు గుర్తుపట్టలేదని తెలిపారు. ప్రస్తుతం జూద శిబిరాన్ని ఖాళీ చేయించామని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఐ తెలిపారు. మరల జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు…
*బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి.*
*ముంబైలోని నివాసంలో కత్తితో దాడిచేసిన దుండగుడు.*
*సైఫ్ అలీఖాన్‌కు తీవ్ర గాయాలు ముంబై లీలావతి ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స.*
*🔹EX కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు.. భోపాల్‌లో పొలిటికల్ వార్*
_🔸MP భోపాల్‌లో 2024 DEC 19న ఓ కార్ నుంచి 52KGల గోల్డ్, ₹10Cr నగదును IT అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం RTO మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. BJP ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని INC విమర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్‌నాథ్ సర్కార్ కరప్షను మారుపేరని కమల నేతలు కౌంటరిస్తున్నారు.
*ఇంటి వద్దకే టెక్నీషియన్లు.. తక్కువ ధరకే సర్వీస్: టీడీపీ*
ఏపీలో వృత్తిదారులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ‘హోమ్ ట్రయాంగిల్ యాప్’తో మెప్మా ఒప్పందం చేసుకుందని టీడీపీ వెల్లడించింది. ’20వేల మంది టెక్నీషియన్లకు మెప్మా శిక్షణ ఇస్తోంది. TV, AC, ఫ్రిజ్, కంప్యూటర్ తదితర 30 రకాల డివైజ్‌లు పాడైతే టెక్నీషియన్లు ఇంటి వద్దకే వచ్చి తక్కువ ధరకే బాగుచేస్తారు. మార్చి నుంచి 123 పట్టణాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో టెక్నీషియన్‌కు ₹20-25వేల ఆదాయం వస్తుంది’ అని పేర్కొంది..
సిఎం నియోజకవర్గం కొడంగల్ లో బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు !
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో, కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు నాయకులు, కార్యకర్తలు.
ఇక ఈ సందర్బంగా కొడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పతనం… కొడంగల్ నియోజకవర్గం నుంచే ప్రారంభం అన్నారు. ఈ నెల 17న చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో కేటీఆర్ సమక్షంలో జరిగే మహా ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు పట్నం నరేందర్ రెడ్డి…
కుంభమేళాపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో చలితీవ్రతతో 11 మంది చనిపోయారని సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..చలిని తట్టుకోలేక చాలామంది ఆస్పత్రుల పాలయ్యారని, అధికారులు పట్టించుకోవడం లేదని పోస్ట్ పెట్టిన లలూ యాదవ్ సంజీవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంజీవ్ సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తగా చెప్పుకుంటున్న లలూ యాదవ్ సంజీవ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
కుంభమేళాపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఇప్పటికే ప్రకటించారు. లక్నోలో ముఖ్యమంత్రి నైట్ షెల్టర్‌ను సందర్శించారు. దుప్పట్లు , స్వెట్లర్లను పంపిణీ చేశారు. భక్తుల్లో అశాంతిని , అలజడిని రేపేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని యోగి ఆరోపించారు.. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు, ప్రయాగ్‌రాజ్ కుంభమేళా నాలుగో రోజుకు చేరుకుంది. భక్తులతో, సాధువులతో ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది. భక్తులు, స్వామీజీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాటు చేసినట్టు సీఎం యోగి తెలిపారు. కుంభమేళా ప్రాంగణంలో వైద్య శిబిరాలు 24 గంటల పాటు పనిచేస్తునట్టు తెలిపారు. భక్తులు అస్వస్థతకు గురైతే వెంటనే చికిత్స అందించేందుకు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. కుంభమేళాను ఇప్పటికే కోట్లాదిమంది భక్తులు సందర్శించారు…
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కేసు నమోదు
అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద నిన్న రాత్రి పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై ఫిర్యాదు చేసిన ఎస్ఐ రమేశ్
ఎస్ఐ రమేశ్ ఫిర్యాదు మేరకు గువ్వల బాలరాజుపై, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు…
*ఖో ఖో వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్ కు భారత జట్టు.
ఖో ఖో వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా 3 మ్యాచుల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. నిన్న పెరూతో జరిగిన మ్యాచులో 70-38 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు మహిళల జట్టు ఇరాన్‌పై ఘన విజయం సాధించింది. 100-16 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇవాళ పురుషుల జట్టు భూటాన్‌తో, మహిళల జట్టు మలేషియాతో పోటీ పడనున్నాయి….
భార్యను చంపిన,గొయ్యి తీసి పూడ్చి పెట్టిన భర్త ,అత్త ,మామ.
మహబూబాబాద్ జిల్లా:
మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీ లోని ఓ ఇంటి ఆవరణ లో వివాహిత ను హత మార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టిన భర్త , అత్త , మామ , ఆడపడుచు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాతిపెట్టిన చోట త్రవ్వు తుండగా బయటపడిన మృతదేహం.
ఇంటికి తాళం వేసి పారారైన మృతురాలి
భర్త , అత్త , మామ , ఆడపడుచు….
TG EAPCET 2025: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల..
తెలంగాణలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 29 నుంచి ఈఏపీ సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఏప్రీల్ 29, 30 తేదీల్లో ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తారు. మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. మే 12 న ఈ సెట్, జూన్ 1న ఎడ్ సెట్, జూన్ 6న లాసెట్, జూన్ 8,9 తేదీల్లో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహిస్తారు..డిప్లొమా విద్యార్ధులు ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ ను మే 12న నిర్వహిస్తారు. ఈ సెట్ ను ఓయూ నిర్వహించనుంది. కన్వీనర్ గా ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ వ్యవహరిస్తారు. కాకతీయ యూనివర్శిటీ ఎడ్ సెట్ నిర్వహిస్తోంది. కేయూ ప్రొఫెసర్ బి. వెంకట్రామిరెడ్డి కన్వీనర్ గా ఉన్నారు. లాసెట్, పీజీఎల్ సెట్ నిర్వహణను ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించనుంది.కన్వీనర్ గా బి. విజయలక్ష్మిని అపాయింట్ చేశారు ఐసెట్ ను మహాత్మాగాంధీ యూనివర్శిటీ నిర్వహిస్తుంది. ప్రొఫెసర్ అలవాల రవి కన్వీనర్ గా కొనసాగుతారు..