దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు.!.
ముమ్మరం ఢిల్లీలోని కర్తవ్య పద్లో జరగనున్న గణతంత్ర వేడుకలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో 5000 మంది కళాకారులు పలు నృత్యాలు ప్రదర్శించనున్నారు. ఐదు వేల మంది కళాకారులతో 45 నృత్య రీతుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు…
*ఇవాళ ఆకాశంలో అద్భుతం*
ఆకాశంలో ఒక అద్భుత మైన ఖగోళ దృశ్యం ఇవాళ రాత్రి కనిపించనుంది. గ్రహ సంయోగంగా పేర్కొనే ఈ దిగ్విషయం పలు గ్రహాల వరుస క్రమం ఏర్పడినప్పు డు సంభవిస్తుంది, ఈ ఖగోళ అద్భుతం జరిగే సమయంలో యురేనాస్ నెఫ్ట్యూషన్లను వీక్షించడానికి బైనాక్యులర్లు టెలిస్కోపు లు అవసరమవుతాయి, ఆకాశంలో కనిపించే వీటి కదలిక మహా అద్భుతంగా ఉంటుంది.
మన సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాలు అంగారక గ్రహం, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒక సరళ రేఖలోకి రానున్నాయి.
ఈ అరుదైన గ్రహాల అమరిక రాబోయే కొన్ని వారాల పాటు కనిపించ నుంది. ఈరోజు ఈ అమరిక ప్రారంభమవుతుంది. ఈ అమరికను సూర్యాస్తమ యం అయిన 45 నిమిషాల తర్వాత వీక్షించవచ్చు..
*జూరాలను వెంటాడుతున్న నీటి లీక్ సమస్య*
తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న మొట్టమొదటి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరా ల ప్రాజెక్టుపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతుంది, 2021లో రిపేరు పనులు ప్రారంభించగా ఇప్పటి వరకు కేవలం 25% పనులు మాత్రమే కంప్లీట్ చేశారు. గేట్లు రోఫ్ డామేజ్, గేట్ల నుంచి నీటి లీకేజీల రిపేర్ పనులు మాత్రం ఇప్పటి వరకు చేయలేదు దీంతో నీటి లీకేజీ సమస్య పెను సమస్యగా మారింది.
ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఈ వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోని పలు గేట్లు డ్యామేజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే గత సీజన్లో అయినా డ్యామేజ్ కారణంగా ప్రజెక్టును నేటికి లీకేజీ సమస్య వెంటాడు తుంది.
ప్రస్తుతం డ్యామ్ లోని 12 క్రస్ట్ గేట్ల నుంచి కంటిన్యూ గా నీరు లీక్ అవుతుంది. ఇందులో 8 క్రస్ట్ గేట్ల రోప్ డ్యామేజ్ అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగే గత సీజన్లో అయిన డ్యామేజ్లకు మరమ్మతులు చేయక పోవడంతో తుప్పుపట్టి గేట్లకు అమర్చిన రబ్బర్లు ఊడిపోయినట్లు తెలుస్తుం ది. ఈ ప్రాంతంలో అధికంగా నీరు లీక్ అవుతుండగా.. ప్రాజెక్టు అధికారులకు ఎం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది.
అయితే దాదాపు 12 గేట్ల నుంచి లీకేజీతో నీరు వృధాగా పోతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కంటిన్యూగా నీరు లీక్ అయితే వచ్చే వేసవి నాటికి జూరాల ప్రాజెక్టు నీటి పై ఆదారపడిన ప్రజలకు నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది.
అలాగే జూరాల ప్రాజెక్ట్ భద్రతపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తు న్నారని, మరి దీనిపై తెలంగాణ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి..
*నాగర్ కర్నూల్ జిల్లాలో మైనింగ్ మంటలు*
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలా రంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మైనింగ్ తవ్వ కాలు నిలిపేయా లంటూ ఈరోజు ఉదయం గ్రామ స్తులు ఆందోళన చేపట్టారు.
గ్రామంలో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు చేపట్టారని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. రాత్రికి రాత్రే పలువురు గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు గ్రామంలోకి రాకుండా ముళ్ల కంచెలు వేశారు గ్రామస్తులు.
అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయా లని డిమాండ్ చేశారు. వీరికి పౌర హక్కుల సంఘం నేతలు మద్దతు ప్రకటిం చారు.గత కొంతకాలంగా మైనింగ్ తవ్వకాలకు సంబంధించి వివాదం కొనసాగుతోంది.
మైనింగ్ తవ్వకాలను పూర్తిగా నిలిపివేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీకి పిలుపునిచ్చారు గ్రామస్తులు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రాత్రికి రాత్రి కొంతమంది గ్రామస్తు లను అరెస్టు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపు లాట జరిగింది. అన్ని పార్టీ నాయకులు, పౌర హక్కుల సంఘాల నేతలు గ్రామస్తు లకు మద్దతు తెలిపారు. మైలారం గుట్టలో తవ్వకా లు ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తుండగా.. ఎప్పటికప్పుడు గ్రామస్తులు అడ్డుకుంటున్నారు.
ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి మైనింగ్ కు వ్యతిరేకంగా జరుగుతు న్న ఆందోళనలో పాల్గొన్నారు.
*ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు*
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లకు పోస్టింగ్లు, బదిలీ ప్రక్రియ చేపట్టారు. 25 మంది ఐఏఎస్లకు పోస్టింగ్లు, బదిలీలు చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.
జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ముకేశ్మార్ మీనాను నియమించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నూ ఆయన కొనసాగను న్నారు.
సీఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు నియమితుల య్యారు.సీఎం ఎక్స్అఫీషి యో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ను నియమించా రు.జలవ నరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గాను ఆయన బాధ్యతలు నిర్వర్తించను న్నారు.
హౌసింగ్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ జైన్ నియమి తులయ్యారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బి. రాజశేఖర్, ప్రభుత్వరంగ సంస్థల ముఖ్యకార్యదర్శిగా కె. సునీత బాధ్యతలు స్వీకరించనున్నారు.
మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం
రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్న ఈటెల*
పేదల భూములు కబ్జా చేయడంతో బ్రోకర్ పై దాడి..
పేదల భూములను ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆక్రమించాడని ఆయనకు ఫిర్యాదులు అందాయి. తమకు న్యాయం చేయాలని బాధిత పేద ప్రజలు ఈటలను వేడుకున్నట్లు సమాచారం. దీంతో ఘటనా స్థలికి వెళ్లిన ఆయన బ్రోకర్తో మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. రియల్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. దీంతో ఎంపీ అనుచరులు, బీజేపీనేతలు సైతం ఆ బ్రోకర్ మీద దాడికి పాల్పడ్డారు. ఒక వీడియో వైరల్ అవుతోంది..
*రైలు పట్టాలపై విద్యార్థిని ఆత్మహత్య?*
ఆంధ్ర మహిళ సభ కళాశాలలో సీఈసీ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని భార్గవి, కాలేజీ వెనకాలే ఉన్న రైల్వే పట్టాలపై ఈరోజు ఆత్మహత్య చేసుకుంది,
సికింద్రాబాద్ పరిధిలో రైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి ఓయూ ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
మంగళవారం ఉదయం జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసు కున్నట్లు తెలుస్తోంది. రైల్వే లోకో పైలట్ సమాచారం మేరకు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదే హాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై ఇంకా మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.