ఖైరతాబాద్ చింతల్బస్తీలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగా ఫుట్పాత్పై ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు..విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నాగేందర్.. అక్కడికి చేరుకొని కూల్చివేతలు ఆపాలని అధికారులను కోరారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడంపై మండిపడ్డారు. దావోస్ నుంచి సీఎం రేవంత్రెడ్డి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలన్నారు. కూల్చివేతలు ఆపకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు..
ఎలా కూల్చి వేస్తారు..
నిర్మాణాల్ని అధికారులు కూల్చివేతలు చేపట్టగా, ఈ కూల్చివేతలపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై దానం ఫైరయ్యారు. ఎక్కడినుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని దానం హుకుం జారీ చేశారు. కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తానంటూ దానం హెచ్చరిక జారీ చేశారు.