సైబర్ నేరగాళ్లు నేపథ్యంలో దీన్ని కూడా తమకు ఒక అవకాశంగా మలచుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే చాలా మంది తమకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ను పోస్ట్ చేస్తుంటారు. తమ స్టేట్సతోపాటు తాము ఏం చేస్తున్నదీ, ఎక్కడికి వెళ్తున్నదీ వంటివి మెసేజ్లు పెడుతుంటారు. ఇలాంటి వాటిని నేరగాళ్లు తమకు అనుకూలంగా మలచుకునే అవకాశం ఉందని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు….సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలంటున్నారు. వ్యూస్ (వీక్షణలు), లైక్స్ కోసం దినచర్యను పోస్ట్ చేయవద్దని, ముఖ్యంగా ఊరెళ్తున్నామంటూ పోస్ట్లు చేయడం యమ డేంజర్ అంటూ ‘ఎక్స్’ ద్వారా పోలీసులు సూచిస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్ట్రాగ్రామ్(YouTube, Instagram)లలో వ్యూస్ కోసం హోంటూర్స్ (ఇంటిని చూపించడం) చేయవద్దని, సోషల్ మీడియాలో ఇంటి చిరునామాను బహిర్గతం చేయవద్దని పోలీసులు పేర్కొంటున్నారు..
కాపురాలే కూలిపోవచ్చు జాగ్రత్త..!
సోషల్ మీడియా ద్వారా మీ నెంబర్ను కూడా ట్రేస్ చేసి ఫేక్ కాల్స్ కూడా రావడం జరుగుతుంది..! మీ అడ్రస్ తో సహా చెబుతూ లేనిపోని అనుమానాలని రేకెత్తిస్తున్నారు…. దీనివల్ల కాపు రాలే కూలిపోతున్నాయి… ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా ఇలానే ఆగం అయిపోయింది.. తెలిసి తెలియని వారు ఫోన్ చేసి లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తుంటారు అది మీరు నిజమని నమ్మి మీ పచ్చని కాపురాల్లో చిచ్చులు పెట్టుకుంటున్నారు… వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేయొద్దు అంటూ పోలీసులు. మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు..