🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 23 – 01 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,
తిథి : *నవమి* మ3.18 వరకు,
నక్షత్రం : *విశాఖ* తె3.22 వరకు,
యోగం : *గండం* తె3.52 వరకు,
కరణం : *గరజి* మ3.18 వరకు,
తదుపరి *వణిజ* తె4.11 వరకు,
వర్జ్యం : *ఉ7.09 – 8.54,*
దుర్ముహూర్తము : *ఉ10.20 – 11.05,*
మరల *మ2.47 – 3.32,*
అమృతకాలం : *సా5.42 – 7.27,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.46,
*_నేటి మాట_*
*భగవంతుడు ఎవరు…???*
ఇది ఈరోజుల్లో అందరికీ తెలిసి , తెలియని ఒక విషయం,
కొంతమంది భయంతో అమ్మో భగవంతుడు అంటే!!!…
ఇంకొంత మంది భగవంతుడు అంటే కోర్కెలు తీర్చేవాడండి అని చెబుతారు!!…
ఆయనంటే నాకు ఇష్టం అండి, భజన చేస్తానండి అని చెబుతారు…
ఇదే చాలా మందికి తెలిసిన భగవతత్త్వం, అర్థం తెలీదు. కోర్కె తీరింది, ఇష్టం పెరిగింది, ఆయన్ని పట్టుకున్నాను. అంతకు మించి అర్థం పర్థం లేదు!!…
ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం…
భగవంతుడు అంటే ఏమిటో తెలుసుకుంటే నువ్వు భగవంతుడు అయిపోతావు.
అంతే తప్ప ఏ కోరిక కావాలంటే అది తీర్చేవాడు కాదు.
ఆయన గురించి విచారణ చేయాలి!!.
కాకపోతే కోరిక కోసం భక్తులు తప్ప అర్థం చేసుకోవడానికి కాదు.
ఎవరైనా అర్థం చెబుతున్నా తెలుసుకునే ప్రయత్నం చేయం.
మనంతట మనం తలుపులు మూసేస్తే సూర్యుడి కిరణాలు మనకి చేరవు, తలుపు తెరవండి, కిరణాలను ప్రసరించనివ్వండి.
ఎంతవరకు కోరిక అనే తెర అడ్డు ఉంటుందో అంతవరకు భగవంతుడిని ఆస్వాదించలేము.
పరమాత్మని ఎందుకు తెలుసుకోవాలి?
పరమాత్మ ఆధారమై ఉన్నాడు, పరమాత్మ వలన ఏర్పడింది, పరమాత్మ చేత నిర్వహింపబడుతుంది.
పరమాత్మే ప్రపంచమై ఉన్నాడు… *అది ఎలా?*
సముద్రము పైన కెరటములు ఉన్నాయి, సముద్రం వలన కెరటాలు ఉన్నాయి.
సముద్రం చేత కెరటాలు ఉన్నాయి, సముద్రమే కెరటం, మనం కెరటం కెరటం అంటున్నాం కదా..
సముద్రం లోని జలం, సముద్రమే జలం కదా!
మనం ప్రత్యేక దృష్టితో కెరటం చూస్తున్నాం కనుక పైకి లేచింది.
ఇంత సేపు ఉంది అంటున్నాం, సముద్ర జలం తప్ప కెరటంలో అన్యమైన జలం ఉందా! లేదు.
అలానే ఈ సృష్టి యావత్తు భగవంతుడే ఉన్నాడు, అన్యమైనది ఏదీ లేదు, లేనే లేదు, పరమాత్మ యందు పరమాత్మ వల్ల పరమాత్మ చేత జరపబడుతున్న ప్రపంచము పరమాత్మ యొక్క స్వరూపమే…
ఇంకా తెలుసుకున్నా కొద్ది లోతు అంతుపట్టనిదే సముద్రం, అలాంటి సముద్రం లోతు తెలుసుకోలేని మనం, సముద్రాన్ని సృష్టించిన ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడం మన తరమా??…
*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏