*సూర్యాపేట జిల్లా*..
పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు భారీగా భక్తులు హాజరు అయ్యారు… మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు …..
నేడు శుక్రవారం రెండో రోజు కావడంతో పవిత్ర గంధం కోసం భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు..
నేడు శుక్రవారం పవిత్రమైన రోజుగా భావిస్తారు..
పవిత్ర గంధోత్సవం ఉదయం 9 గంటలకు ప్రారంభమై ఊరంతా కూడా తిరిగి రావడం జరుగుతుంది….
ఈ గ్రంధానికి ప్రత్యేక నమాజ్ను నిర్వహిస్తారు.. గ్రామాల్లో గుర్రంపై ఊరేగింపు నిర్వహించి, సాయంత్రం 4 గంటల సమయంలో పవిత్ర గంధాన్ని సైదా బాబాకి సమర్పిస్తారు.. ఈ వేడుకల్లో కీలక ఘట్టం చూడడానికి, పవిత్ర గ్రంధాన్ని తాకటానికి, వేల సంఖ్యలో భక్తులు ఈ గంధం ఊరేగింపు కార్యక్రమానికి హాజరయ్యారు……
ఏర్పాటులో కొంత ప్రభుత్వం విఫలమయింది.. సరైన ఏర్పాటు చేయకపోవడంతో కొంత భక్తులు ఇబ్బందికి గురయ్యారు.. త్రాగునీరు దొరక కొంత ఇబ్బందికి గురయ్యారు.. వంటావార్పు కార్యక్రమాలు చేసుకోవడానికి ఆరు బయటనే నిర్వహించుకోవడం… అంతేకాకుండా దర్గా వెలుపల అడ్డగోలు వసూలతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు…
దర్గాలో సైదులు బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి,, మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు….
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..
జాన్ పహాడ్ సైదన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి గంధం సమర్పించిన,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.


జాన్ పహాడ్ దర్గా కి రాష్ట్రం లో ప్రత్యేకత ఉంది.
సైదులు బాబు ఆశీస్సులు అందరిపై ఉండాలి..
జాన్ పహాడ్ దర్గా ను అని విధాల అభివృద్ధి చేయడం జరుగుతుంది..
బెట్టతండ లిఫ్ట్ కు నిధుల మంజూరి.
లిఫ్ట్ కు రోడ్ మంజూరి..
మండల వ్యాప్తంగా 60లక్షలు మంజూరి..
జాన్ పహాడ్ దర్గా అభివృధి కే కోటి రూపాయల పైన నిధులు కేటాయించడం జరిగింది..
లేనిపోని అపోహలను సృష్టించేందుకే ప్రజలని తప్పు దోవ పట్టిస్తున్నారు.
10 సంవత్సరాల్లో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు.
ఎల్లుండి నుండి ప్రతి ఒక్కరికి నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డు అందుతుంది.
బిఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారూ.
గతం ప్రభుత్వం కనీసం ఒక ఇల్లుకూడా ఇవ్వలేకపోయింది..
కాంగ్రెస్ ప్రభుత్వం… అధికారంలోకి వచ్చాక… ఇందిరమ్మ ఇళ్ల పేరుతో.. 5లక్షలు. ఇస్తున్నాం.. .
Sc,St లకు 6లక్షలు..
భూమిలేని రైతుకూలీలకు.. సం.. 12000ఇవ్వబోతున్నాం..
కేబినెట్ మంత్రులం కూర్చొని రాష్ట్రం లో రైతులకు.. విద్యార్థుల కోసం, ప్రజల కోసం ఆహార నిషలు కృషి చేస్తున్నాం.
రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం.
పండిన పంటలకు బోనస్ ఇచ్చాము.
ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చి, అందరు తినేలా సన్న బియ్యం ఇవ్వబోతున్నాం.