రాజకీయాలకు గుడ్ బై…

రాజకీయాలకు గుడ్ బై…

*వైసీపీ నేత విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు*

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.

ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ రాజకీయ నేత, వైసీపీ రాజ్య సభ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయ సాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని విజయసాయిరెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు…