పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం..!
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో ఇవి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశ పెడతారు. శనివారం కేంద్ర బడ్జెట్‌ను ఆమె సభకు సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా శుక్రవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ జరుగుతాయి. తొలి విడత ఫిబ్రవరి 13వ తేదీ వరకూ, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరుగుతాయి. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుండటం వరుసగా ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. బడ్జెట్ సమావేశాల్లో పలు బిల్లులను కేంద్రం ప్రవేశ పెట్టే అవకాశముంది. కేంద్రం ప్రవేశ పెట్టనున్న బిల్లుల్లో ‘ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్స్ ఇన్ ఎయి ర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్, త్రిభువన్ శాకరీ యూనివర్సిటీ, బ్యాంకింగ్, రైల్వేస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆయిల్ ఫీల్డ్స్, 2025 ఫైనాన్స్ బిల్లు ఉన్నాయి. గత సమావేశాల్లో పెండింగ్‌లో పడిపోయిన మరో 10 బిల్లులూ ఈసారి సభకు రానున్నాయి.
*_అమల్లోకి కోడ్.. కొత్త స్కీమ్స్‌కు బ్రేక్..!!_*
7 ఉమ్మడి జిల్లాల్లో అమల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్
పాత పథకాల అమలు తప్ప.. కొత్తవాటికి నో చాన్స్
జిల్లాల్లో మంత్రుల శంకుస్థాపనలు బంద్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎలక్షన్కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీమ్స్‌కు బ్రేక్ పడింది.
2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేయగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వరంగల్– -ఖమ్మం- -నల్లగొండ ఉపాధ్యాయ, మెదక్- –నిజామాబాద్– -ఆదిలాబాద్- -కరీంనగర్ ఉపాధ్యాయ, మెదక్- – నిజామాబాద్— ఆదిలాబాద్– కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 7 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 40 రోజులు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తప్ప మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలో కోడ్ వర్తిస్తుంది.
ఈ నేపథ్యంలో మార్చి 8 వరకు ఇప్పటికే ప్రకటించిన స్కీమ్స్‌ను మాత్రమే అమలు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరు స్కీమ్‌లను ప్రారంభించింది. లబ్ధిదారులకు నగదు బదిలీతోపాటు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సాంక్షన్ పత్రాలు అందచేసింది. ఇవి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగనున్నాయి.
*_శంకుస్థాపనలు బంద్_*
ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు తగ్గనున్నాయి. నిత్యం జిల్లాల్లో మంత్రులు, జిల్లా ఇన్ చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. కోడ్ అమల్లోకి రావడంతో ఈ ఏడు ఉమ్మడి జిల్లాల్లో శంకుస్థాపనలు బంద్ కానున్నాయి. బుధవారం పలువురు మంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్లాల్సి ఉండగా.. కోడ్ అమల్లోకి రావడంతో వాటిని రద్దు చేసుకున్నారు.
*_వరుసగా ఎన్నికలు_*
ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే నెల 27న జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికల పక్రియ మార్చి 8న ముగియనున్నది. మరుసటి రోజు ఎన్నికల కోడ్ ముగుస్తుంది. మార్చి 29న 3 ఎమ్మెల్యే కోటా, ఆగస్ట్ 6న హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ టర్మ్ సైతం ముగియనున్నది. వీటికి కూడా త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ లోపే లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే నెలలో ఒక దశ లేదా రెండు దశల్లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. మార్చిలో ఈ పక్రియ ముగియనుందని సమాచారం. ఇక లోకల్ బాడీ పూర్తయ్యాక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించే అవకాశముందని తెలుస్తున్నది. ఈ ఏడాది చివరలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగనున్నట్టు సమాచారం. 2020 డిసెంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగ్గా తర్వాత ఏడాది ఫిబ్రవరిలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీటితోపాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మంతో పాటు పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల టర్మ్ కూడా ముగియనున్నది.
*_నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం_*
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రచారానికి బీజేపీ రెడీ అయింది. ఫిబ్రవరి 2 నుంచి మూడు సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలూ ప్రచారంలో పాల్గొనేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. నిజామాబాద్–కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా మల్క కొమరయ్య, అదే సెగ్మెంట్లో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి అంజిరెడ్డి, వరంగల్–ఖమ్మం–నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డి పేర్లను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.
వారంతా ప్రస్తుతం ప్రచారాన్ని ప్రారంభించారు. పోలింగ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ఇతర బీజేపీ నేతలు ప్రచారాన్ని వెంటనే ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల ఆఫీసులను ప్రారంభించేందుకు బీజేపీ రెడీ అయింది. వచ్చేనెల 2న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకుగానూ ఇప్పటికే బీజేపీ జిల్లా, అసెంబ్లీ, మండలాల వారీగా ఇన్ చార్జ్ లనూ నియమించింది.
*ఓటర్ల జాబితాపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు*
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది…
గ్రామాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించింది.
గత ఏడాది OCT 1 నుంచి DEC 31 వరకు జాబితా ఉండగా, ఫిబ్రవరి 3 వరకు సప్లిమెంటరీ లిస్టు రెడీ చేయాలని సూచించింది.
ఓటర్ల తొలగింపు, చేర్పులపై ఫిబ్రవరి 4న స్థానిక రాజకీయ నాయకులతో భేటీ నిర్వహించాలంది.
ఫిబ్రవరి 6 నాటికి తుది జాబితాను ఖరారు చేయాలని పేర్కొంది…
*🔹స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..❓*
_ఎన్నికల కోసం దూకుడు పెంచిన ప్రభుత్వం.._
_ఉద్యోగులు, అధికారులతో వరస భేటిలతో సీఎం, మంత్రులు బిజీబిజీ.._
*🔹ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు..?*
*మొదటి వారంలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం*
*ఫిబ్రవరి 1న సబ్ కమిటీకీ బీసీ కుల గణన ముసాయిదా నివేదిక ను అందించనున్న అధికారులు..*
*పిబ్రవరి 3న సబ్ కమిటీ సమావేశం* *5న కేబినెట్ భేటి.. ముసాయిదాకు అమోదం..
7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..* *10న లేదా 12న రిజర్వేషన్లు అమలు..*
ఫిబ్రవరి 15న షెడ్యూల్ ప్రకటించే అవకాశం..
మార్చి మొదటి వారం నుంచి, రెండవ వారంలోగా పోలింగ్ పూర్తి..
పరీక్షల లోపే స్థానిక ఎన్నికలు ముగించే యోచనా..?
రేపటి నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు..
స్థానిక ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేయనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు..
GBS Case: బిగ్ అలర్ట్.. తెలంగాణలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు!
దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్ బారే సిండ్రోమ్ కేసులు తెలంగాణలో నమోదయింది.
తాజాగా.. తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ కేసును వైద్యులు గుర్తించారు. సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్ లక్షణాలు ఉండడంతో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో అందిస్తున్నారు.
పశ్చిమబెంగాల్లో జీబీఎస్ కారణంగా గత నాలుగు రోజుల్లో ఒక చిన్నారి సహా ముగ్గురు మరణించారు. మరోవైపు.. మహారాష్ట్రలోని పుణెలోనూ దాదాపు 130 జీబీఎస్ అనుమానాస్పద కేసులు నమోదు అయ్యాయి.
తొలి జీబీఎస్ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తం అవుతున్నారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరల్ కారణంగా నరాలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది.
ఈ వైరస్ సోకిన వ్యక్తికి ఒళ్లంతా తిమ్మిరిగా ఉంటుందని, కండరాలు సైతం బలహీనంగా మారడంతో పాటు డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం తీసుకోవడం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.
కలుషిత ఆహారం తీసుకోవడం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, ఈ జీబీఎస్ అనేది అంటు వ్యాధి కాదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నయం చేసుకోవచ్చని చెబుతున్నారు. గులియన్-బారే సిండ్రోమ్ అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. కండరాల బలహీనత లేదా పక్షవాతం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది బలహీనత, పక్షవాతం లేదా నొప్పిని కలిగిస్తుంది..
దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్
గుడ్‌న్యూస్.. దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్
ఉన్నత విద్యలో సీట్ల భర్తీలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్, 5% రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది. అంధత్వం, చెవుడు, మానసిక వైకల్యం, బధిరులు, మరుగుజ్జులు, యాసిడ్ బాధితులు, ఆటిజం, కండరాలు సరిగా పని చేయని వారిని 5 కేటగిరీలుగా డివైడ్ చేసి ఒక్కో కేటగిరీకి 1% రిజర్వేషన్ అమలు చేయనుంది.
యూరప్ లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడిన ముఠా
ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు 100 మందిని మోసం చేసిన కేటుగాళ్లు
నిందితులు కొట్టు సాయి రవితేజ, కొట్టు మనోజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
సుమారు రూ.5కోట్లు వసూలు చేసినట్టు ఆధారాలు
ఈ ముఠాలో మొత్తం ఆరుగురిపై సీఐడీ అధికారులు కేసు నమోదు
హైదరాబాద్, విజయవాడ, దిల్లీలో ఈ ముఠా బ్రాంచ్‌లు ఏర్పాటు చేసినట్టు దర్యాప్తులో వెల్లడి..
ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్, బోర్డ్ ఎగ్జామ్స్ టైం టేబుల్లో స్వల్ప మార్పు
ఏపీ టెన్త్ విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ టైం టేబుల్లో స్వల్ప మార్పు జరగనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పదో తరగతి విద్యార్థులకు సంబంధించి పబ్లిక్ పరీక్షల (AP SSC Exam Date 2025) టైం టేబుల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 17 నుంచి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్ పరీక్షల తేదీలతో రివైజ్డే ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది విద్యాశాఖ.
అయితే పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 31న ఎగ్జామ్స్ పూర్తి కావాల్సి ఉంది. కానీ మార్చి 31వ రంజాన్ సెలవు దినంగా ఏపీ ప్రభుత్వ క్యాలండర్లో పేర్కొన్నారు. ఒకవేళ నెలవంక కనుక మార్చి 31న కనిపిస్తే అదే రోజు రంజాన్ జరుపుకుంటారు.
ఆ రోజున పండగ కన్ఫామ్ అయితే చివరి ఎగ్జామ్ సోషల్ పేపర్ మార్చి 31 బదులుగా ఏప్రిల్ 1న నిర్వహిస్తామని ఏపీ ఎగ్జామ్స్ విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. చివరి ఎగ్జామ్ ఒక్కటీ ఒక్కరోజు వెనక్కి జరిగే అవకాశం ఉందని, విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు.
ఏపీలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి షెడ్యూల్
17-03-2025 (సోమవారం) – ఫస్ట్ ల్యాంగ్వేజ్ గ్రూప్ ఏ – 9.30 నుంచి 12.45 వరకు
17-03-2025 (సోమవారం) – ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్ – 9.30 నుంచి 12.45 వరకు
19-03-2025 (బుధవారం) – సెకండ్ ల్యాంగ్వేజ్ – 9.30 నుంచి 12.45 వరకు
21-03-2025 (శుక్రవారం) – ఇంగ్లీష్ – 9.30 నుంచి 12.45 వరకు
22-03-2025 (శనివారం) – ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్ – 9.30 నుంచి 11.15 వరకు
22-03-2025 (శనివారం) – OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) – 9.30 నుంచి 12.45 వరకు
24-03-2025 (సోమవారం) – మ్యాథమేటిక్స్ – 9.30 నుంచి 12.45 వరకు
26-03-2025 (బుధవారం) – భౌతికశాస్త్రం – 9.30 నుంచి 11.30 వరకు
28-03-2025 (శుక్రవారం) – జీవశాస్త్రం – 9.30 నుంచి 11.30 వరకు
29-03-2025 (శనివారం) – OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) – 9.30 నుంచి 12.45 వరకు
29-03-2025 (శనివారం) – SSC ఒకేషనల్ కోర్స్ (థియరీ)- 9.30 నుంచి 11.30 వరకు
మార్చి 31 లేదా ఏప్రిల్ 01 – సాంఘీక శాస్త్రం – 9.30 నుంచి 12.45 వరకు..
*తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ సూసైడ్*
*పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఉదయం స్టేషన్లో తుపాకీతో కాల్చుకొని సూసైడ్*
*ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండైన ఏజీఎస్ మూర్తి*
*_సికింద్రాబాద్ లో వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటుకు లైన్ క్లియర్..!!_*
సికింద్రాబాద్ కంట్మోనెంట్‌లోని పబ్లిక్ గార్డెన్లో మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. పార్కులో విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త జె.ఉమేశ్వరరావు దాఖలైన పిల్‌ను బుధవారం హైకోర్టు కొట్టివేసింది.
పికెట్ పబ్లిక్ గార్డెన్‌లోని విగ్రహాల ఏర్పాటుకు అక్రమ నిర్మాణాలను తొలగించాలని, వాజ్‌పేయి స్మారక విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాల బెంచ్ విచారణ చేపట్టంది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. కేంద్రం వర్సెస్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదిస్తూ.. దేశానికి అంతర్జాతీయంగా ప్రతిష్టలు తెచ్చిన మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటుకు 2022లో అనుమతి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధంకాదని తెలిపారు. వాదనలు విన్న కోర్టు.. వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటులో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ పిల్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది…
💥 > *తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో చిరుత సంచారం. శిలా తోరణంకు వెళ్లే మార్గంలో సంచరిస్తున్న చిరుత. భయాందోళనకు గురైన భక్తులు.*
💥> తెలంగాణలో యూనివర్సిటీ అధ్యాపకుల పదవీవిరమణ వయసు పెంపు. 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు. UGC వేతన స్కేల్‌ను పొందుతున్న అధ్యాపకులకు మాత్రమే వర్తింపు.
💥> HYD: ట్యాంక్ బండ్ బోటు ప్రమాదంపై మంత్రి జూపల్లి ఆగ్రహం. ప్రమాదంపై ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని అధికారులపై మంత్రి ఫైర్. తక్షణమే ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించాలని మంత్రి ఆదేశం. టూరిజం బోట్లో బాణసంచా ఎలా అనుమతిస్తారన్న మంత్రి జూపల్లి.
💥> కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు. కర్నూలులో హైకోర్టు బెంచ్ భవనాల కోసం అన్వేషణ. ఏపీ ఈఆర్సీ, ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ భవనాలను పరిశీలించిన అధికారులు.
💥> విశాఖ ఉక్కుకు మళ్లీ జీవం పోస్తాం. ఉక్కుమంత్రిగా నాకు ప్రధాని మోడీ గొప్ప అవకాశం ఇచ్చారు. స్టీల్ అభివృద్ధి కోసం రాష్ట్ర నేతలు నన్ను చాలాసార్లు కలిశారు. స్టీల్‌ప్లాంట్‌పై ఎన్నోసార్లు సమీక్షలు కూడా చేశాం. 2030లోపు 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో మనం రెండో స్థానంలో ఉన్నాం – కుమారస్వామి
💥> HYD: బాలానగర్ పీఎస్ పరిధి గాంధీనగర్ చెత్తకుండీలో పేలుడు. చెత్త క్లీన్ చేస్తున్న మహిళకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. పేలుడుకు గల కారణాలపై క్లూస్ సేకరిస్తున్న పోలీసులు.
💥> ఏపీలో మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానుండటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పెరిగిన రద్దీ. సీఎఫ్ఎంఎస్ సర్వర్ ఓపెన్ కాకపోవడంతో నిలిచిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. రేపు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందంటున్న అధికారులు.
💥> లక్ష్మిశ్రీనివాస కన్స్ట్రక్షన్ ఎండీ అరెస్ట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విజయలక్ష్మి తప్పించుకునే యత్నం. ఎయిర్‌పోర్ట్‌లో విజయలక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు. మల్లంపేటలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి విల్లాలు నిర్మించిన విజయలక్ష్మి. ప్రభుత్వ భూమిలో 17 విల్లాలు నిర్మించి విక్రయం. ఒక్కో విల్లాకి కోట్ల రూపాయలు వసూలు చేసిన విజయలక్ష్మి. ఇటీవల అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా. నష్టపోయిన విల్లా యజమానుల ఫిర్యాదుతో కేసు నమోదు.
💥ఏపీ: వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.. వాట్సాప్ సేవల కోసం 95523 00009 నంబర్ ఏర్పాటు.. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 పౌర సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ, దేవాదాయశాఖ, ఎనర్జీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్ వంటి పలు రకాల సేవలు.. రెండో దశలో 300కు పైగా సేవలు అందుబాటులో ఉంటాయి-మంత్రి నారా లోకేష్
💥> వాషింగ్టన్: విమాన ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇప్పటివరకు 18 మృతదేహాలు వెలికితీత. కాన్సాస్ నుంచి ప్రయాణికులతో వస్తున్న PSA ఎయిర్‌లైన్స్ విమానం. శిక్షణలో ఉన్న మిలటరీ హెలీకాప్టర్‌ను విమానం ఢీకొట్టడంతో దుర్ఘటన.
💥> విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రమంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మ.. రోడ్‌షో అనంతరం స్టీల్‌ప్లాంట్ చేరుకున్న కేంద్రమంత్రులు.. కేంద్రమంత్రులు వచ్చే సమయంలో దీక్షా శిబిరం వద్ద కార్మికుల నినాదాలు.. సెయిల్ లో విలీనం చేయాలని.. సొంత గనులు కేటాయించాలని డిమాండ్..
💥> ఢిల్లీ: స్పీకర్ ఓంబిర్లాను కలిసిన జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్.. స్పీకర్‌కు వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై జేపీసీ నివేదిక అందజేత.. నిన్న జరిగిన సమావేశంలో నివేదికను ఆమోదించిన కమిటీ.. జేపీసీ నివేదికను పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం
💥అమెరికా: విమాన ప్రమాదంలో పెరిగిన మృతులు. 67 మంది మృతి చెందినట్టు అధికారిక ప్రకటన. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్‌ను ఢీకొట్టిన విమానం. వాషింగ్టన్‌లోని రీగన్ ఎయిర్పోర్ట్ దగ్గర ఘటన
💥నేడు ఏపీ డీజీపీ ద్వారకాతిరుమలరావు పదవీ విరమణ. కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న హరీష్‌కుమార్. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గింది – ద్వారకా తిరుమలరావు. దేశ వ్యాప్తంగా సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. విజయవంతంగా చాలా కేసులను డీల్ చేశా. రైల్వే డీజీగా పనిలేక బాధగా అనిపించేది -ఏపీ డీజీపీ ద్వారకాతిరుమలరావు